పెబ్బేరు, ఆగస్టు 3: పెబ్బేరు మార్కెట్‌ను మోడల్ మార్కెట్‌గా తీర్చిదిద్దుతామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మార్కెట్ యార్డు ఆవరణలో రూ.99 లక్షల నిధులతో షాపింగ్ కాంప్లెక్స్, పబ్లిక్ టాయిలెట్స్, సీసీ రోడ్లు, వే బ్రిడ్జీలను కలెక్టర్ యాస్మిన్ బాషా, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మంగరాయి శ్యామలతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు. మార్కెట్‌కు వచ్చే రైతులకు వసతులు కల్పిస్తామన్నారు.