ఏపీలో కేసీఆర్ జెండా మోస్తాం
సీఎం కేసీఆర్ మాకు నచ్చడానికి మొదటి కారణం గొర్రెలపెంపకందారులకు 85% సబ్సిడీతో గొర్రెలు ఇచ్చారు. మా వృత్తిదారుల నైపుణ్యాన్ని గుర్తించి, ఈ ప్రపంచానికి ఎరుకయ్యేలా అసెంబ్లీలో గొప్పగా చెప్పారు.
- జెండా ఎత్తే తొలి కార్యకర్తను నేనే
- గొర్రెలకాపరుల గౌరవం పెంచారు
- రైతుబంధు లాంటివి ఆయనతోనే సాధ్యం
నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ మాకు నచ్చడానికి మొదటి కారణం గొర్రెలపెంపకందారులకు 85% సబ్సిడీతో గొర్రెలు ఇచ్చారు. మా వృత్తిదారుల నైపుణ్యాన్ని గుర్తించి, ఈ ప్రపంచానికి ఎరుకయ్యేలా అసెంబ్లీలో గొప్పగా చెప్పారు. ‘ఐఏఎస్ అధికారులకు ఆరు నెలలు శిక్షణ ఇచ్చినా ఏది ఎవరి గొర్రో చెప్పలేరు. కానీ, గొర్రెల కాపరులు చెప్పగలరు’ అంటూ కేసీఆర్ చేసిన ప్రశంసలు మేం గర్వపడేలా చేశాయి. తెలంగాణలోని మా బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు రైతుబంధు, దళితబంధు పథకాల గురించి తెలుసుకొన్నా. ఆంధ్రప్రదేశ్‌లోని తిరువూరు, ఏ కొండూరు, విసన్నపేట మండలాల్లోని దళిత సంఘాల నాయకులు దళితబంధు పథకాన్ని మెచ్చుకోవడమే కాదు కేసీఆర్‌కు పాలాభిషేకం చేసి గౌరవించాలని భావిస్తున్నారు. తెలంగాణలో రైతుబంధుని చూసే ఏపీలో రైతు భరోసా పథకం పెట్టారు. తెలంగాణను చూసే ఆసరా పెన్షన్లు పెంచారు.
మా హైదరాబాద్.. మా కేసీఆర్..
తెలంగాణ ఉద్యమ సమయంలో మాకు అనేక భయాలు ఉండేవి. కానీ, తెలంగాణ ఏర్పడి ఏడాది తిరిగే సరికి ‘మా తెలంగాణ, మా హైదరాబాద్, మా కేసీఆర్’ అనే ఫీలింగ్ వచ్చింది. ఉద్యమకాలంలో ఎన్నడూ బతుకుదెరువు కోసం వచ్చిన సీమాంధ్రులపై దాడులు జరగలేదు. ఇప్పుడు కూడా హైదరాబాద్‌లో మా తిరువూరు కుటుంబాలు 200కుపైగానే ఉంటున్నాయి. ఈ రోజు ఆంధ్రా కంటే తెలంగాణ ఎంతో బాగున్నది. తిరువూరు నియోజకవర్గాన్ని తెలంగాణలో కలిపితే బాగుంటుంది. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంటే కేసీఆర్ ఒప్పుకోనన్నారు. రైతులకు అండగా ఉంటానన్నారు. స్వేచ్ఛా మార్కెట్, కాంట్రాక్ట్ వ్యవసాయం వల్ల రైతులు నష్టపోతారన్న ఉద్దేశంతో మోటర్లకు మీటర్లను వ్యతిరేకించారు. అట్లా వ్యతిరేకించిన మొనగాడు దేశం మొత్తం మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కడే!
జై కేసీఆర్
దేశ ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీ కోసం ఎదురుచూస్తున్నారు. మోదీ యాక్షన్‌కింగ్. కాంగ్రెస్ నమ్మకం కోల్పోయింది. చంద్రబాబు మోసగాడు. జగన్ వల్ల నష్టపోతున్నాం. రాజకీయంగా మంచి భావాలున్న వ్యక్తి రావాలని ఎదురుచూస్తున్నాం. దేశాన్ని ప్రగతి బాటపట్టించి, బాగుచేద్దామనే ఆలోచన కేసీఆర్‌లో ఉన్నది. అందుకే ముందడుగు వేస్తున్నా. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడితే ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ జెండా ఎత్తే మొదటి కార్యకర్తను నేనే. పార్టీ ఆవిర్భావ సభకు పిలిస్తే వెళ్లాలని ఉన్నది. పిలవకున్నా జై కేసీఆర్ అంటా.
మోటర్లకు మీటర్లు పెట్టబోనన్న ధీశాలి: గొరిపర్తి రామకృష్ణ, గొర్రెల-మేకల పెంపకం యూనియన్ కృష్ణా జిల్లా మాజీ చైర్మన్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

