హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (MLA Harish Rao) నూతన సంవత్సర (Happy News Year) శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని, అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. గతాన్ని సమీక్షించుకుని బంగారు భవిష్యత్తు నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి ఇంటా సంతోషాలు వెల్లి విరియాలని, ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం గడపాలని అన్నారు. విద్యార్థులు (Students), యువత నూతన లక్ష్యాలు నిర్దేశించుకుని, వాటిని సాధించేలా ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. 2023వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, 2024లోకి అడుగుపెడుతున్న సమయాన అందరికీ శుభం కలగాలని కోరారు.
నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేశమంతటా విజయ భేరి మోగించాలని ఆకాంక్షించారు.