గురువారం 09 జూలై 2020
Telangana - Apr 08, 2020 , 01:14:03

కరోనాపై పోరులో మేము సైతం..

కరోనాపై పోరులో మేము సైతం..

  • ముందుకొచ్చిన 7,600 మంది ఫార్మా వైద్యులు
  • ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్తా
  • ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనాపై పోరాటానికి వైద్యపరంగా సాగిస్తున్న యజ్ఞంలో ఫార్మా వైద్యులు ముందుకు వచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్తానని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌ తెలిపారు. ఫార్మా డీ డాక్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బానోత్‌ చంద్రశేఖర్‌నాయక్‌ ఆధ్వర్యంలో ఫార్మా వైద్యులు రూప, నరేశ్‌, రాంరెడ్డి మంగళవారం బీ వినోద్‌కుమార్‌తో సమావేశమై తమ సేవలను వినియోగించుకోవాల్సిందిగా సూచించారు. ఫార్మా డీ వైద్యుల సేవలను ఉపయోగించుకొనేలా ప్రభుత్వపరంగా చర్యలు తీసుకొంటామని ఈ సందర్భంగా వారికి వినోద్‌ అభయమిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,900 మంది ఫార్మా విద్యార్థులు, 5,700 మంది ఫార్మా పట్టభద్రులు ప్రభుత్వం అందిస్తున్న కరోనా సేవల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని, తమ సేవలను వినియోగించుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్‌, మంత్రి ఈటల రాజేందర్‌కు రాసిన లేఖలను వినోద్‌కుమార్‌కు చంద్రశేఖర్‌నాయక్‌ అందించారు.


logo