బాసర ట్రిపుల్ ఐటీకి నీటి కరువు
నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీకి నీటి దెబ్బ తగిలింది. రాజీవ్‌గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ)లో తాగునీటి సమ స్య తలెత్తడంతో యాజమాన్యం ఇటీవల దస రా సెలవులను పొడిగించింది.
- నీటి సమస్యతో తరగతులు బంద్
- మరమ్మతులకు నోచుకోని మోటర్లు
- నేటినుంచి ఆన్లైన్ తరగతుల నిర్వహణ
- బ్లెండెడ్, హైబ్రిడ్ మోడ్‌లోనూ క్లాసులు
ముథోల్, అక్టోబర్ 25 : నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీకి నీటి దెబ్బ తగిలింది. రాజీవ్‌గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ)లో తాగునీటి సమ స్య తలెత్తడంతో యాజమాన్యం ఇటీవల దస రా సెలవులను పొడిగించింది. తాజాగా ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు 2026-27 సెమిస్టర్-1కు సం బంధించి ఆన్లైన్, బ్లెండెడ్, హైబ్రిడ్ మోడ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.
నూతన షెడ్యూల్‌ను అనుసరించి సోమవారం నుంచి పీయూసీ-1 మొదలు ఈ-4 వరకు ఆన్లైన్ తరగతులు ప్రారంభంకానున్నాయి. నవంబర్ 17 వరకు ఆన్లైన్లోనే సిలబస్ పూర్తి చేయాలని నిర్ణయించింది. క్యాంపస్‌కు విద్యార్థులు తిరిగి వచ్చే తేదీలకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా తీసుకున్న నిర్ణయానికి సహకరించాలని కోరింది.
మరమ్మతులకు నోచుకోని మోటర్లు
బాసర ట్రిపుల్ ఐటీలో సుమారు 9వేల మంది విద్యార్థులు చదువుతుండగా.. రోజుకు దాదాపు 25 లక్షల లీటర్ల నీరు అవసరమని తెలుస్తున్నది. గోదావరి నది నుంచి ఇంటెక్ వెల్ ద్వారా ట్రిపుల్ ఐటీకి నీటిని సరఫరా చేస్తుండగా మూడు మోటర్లలో ఒక దాంట్లో సమస్య తలెత్తింది.
దీంతో నీరు సరిపోదని గుర్తించి ఇటీవల సెలవులు పొడిగించినట్టు తెలుస్తున్నది. ప్రధానంగా గోదావరి నదిలోని సంపులో మూడు మోటర్లు నడిస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ.. ఇక్కడి మూడు మోటర్లు పాడయ్యాయి. దసరా సెలవులు ముగియడంతో ఒక మోటర్‌కు మరమ్మతులు చేశారు. దీంతో గోదావరి నది నుంచి ఇంటెక్ వెల్ ద్వారా క్యాంపస్‌లోని చెరువులోకి నీటిని తరలిస్తున్నారు. ఒక మోటర్తో చెరువు నింపి నీరందించడం కష్టమవుతున్నది. ఈ నీరు కేవలం బోధన సిబ్బందికి మాత్రమే సరిపోతాయని పలువురు పేర్కొంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

