బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి
కాంగ్రెస్ పాలనలో బతుకమ్మను నీటి కరువు వెక్కిరిస్తున్నది. తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపమైన బతుకమ్మ పండుగ పెత్రమాస (పితృ అమావాస్య) నాడు మొదలై తొమ్మిదోనాడు సద్దుల బతుకమ్మతో పూర్తవుతుంది. ఈ తొమ్మిది రోజులు ఇల్లిల్లూ పూలవనమై తులతూగిన సద్దుల బతుకమ్మ నాడు గంగమ్మను చేరటం ఆనవాయితీ.
- వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
- 20 ఏండ్ల తర్వాత దుస్థితి
- పైడిపల్లిలోనూ ఇదే పరిస్థితి
వరంగల్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పాలనలో బతుకమ్మను నీటి కరువు వెక్కిరిస్తున్నది. తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపమైన బతుకమ్మ పండుగ పెత్రమాస (పితృ అమావాస్య) నాడు మొదలై తొమ్మిదోనాడు సద్దుల బతుకమ్మతో పూర్తవుతుంది. ఈ తొమ్మిది రోజులు ఇల్లిల్లూ పూలవనమై తులతూగిన సద్దుల బతుకమ్మ నాడు గంగమ్మను చేరటం ఆనవాయితీ. మునుపెన్నడూ లేనిరీతిలో ఈ సారి బతుకమ్మను వేసేందుకు నీటికటకట దాపురించింది. బీఆర్ఎస్ హయాంలో కరీంనగర్ ఎల్ఎండీ నుంచి సూర్యాపేట జిల్లా కోదాడ, తుంగతుర్తి దాకా సజీవ నదిని తలపించిన ఎస్సారెస్పీ కాలువ.. ప్రస్తుత కాంగ్రెస్ పాలన పుణ్యమా అని రెండున్నర దశాబ్దాల క్రితం నాటి దుర్భర దృశ్యాన్ని మరోసారి కండ్ల ముందు నిలబెట్టింది. కేసీఆర్ చేపట్టిన ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంతో మరమ్మతులు చేపట్టగా వేలాది చెరువులు సజీవ జలనిధిగా మారిన ఎస్సారెస్పీ కాలువ.. ధాన్యపు రాసులను కురిపించటమే కాకుండా తెలంగాణ సంస్కృతికి పబ్బతి పట్టింది.
కేసీఆర్ మీద ఉన్న కోపమో.. బీఆర్ఎస్పై ఉన్న కక్షపూరిత వైఖరి కారణంగానో కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును పడావుపెట్టడంతో ఎస్సారెస్పీ కాలువ బీడువారిపోయింది. ఫలితంగా వరంగల్ జిల్లా వరంగల్ మండలం ఆరేపల్లిలో సద్దుల బతుకమ్మను ఎప్పటికీ గంగకు చేర్చే (నిమజ్జనం) చోటైన ఎస్సారెస్పీ కాలువల్లో నీరు లేకపోవటంతో రైతులు రక్తమని రాజేందర్, బోడ పార్వతి బోరుబావుల నుంచి (కాలువకు 300 మీటర్ల నుంచి 400 మీటర్ల వరకు) మూడు రోజుల నుంచి నీటిని ఎస్సారెస్పీ కాలువలో నింపుతున్నట్టు స్థానికులు చెప్పారు. మూడు రోజులుగా రెండు బోరుబావుల నుంచి నీటిని తోడి పారిస్తున్నామని, మరో రెండు రోజులు ఇలాగే పారించి కనీసం 4 అడుగుల ఎత్తు (బతుకమ్మ నీటిలో తేలియాడేస్థితి) వరకు నీటిని నింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆరేపల్లి గ్రామస్తులు సుంకరి ప్రశాంత్, కోతిమిర కుమార్, నాగుర్ల నవీన్, కమలాపురం జితేందర్, బుద్దె ఈశ్వర్, మోర్తాల రమేశ్ పేర్కొన్నారు.
పైడిపల్లి బతుకమ్మకుంటలోనూ..
వరంగల్ జిల్లా పైడిపల్లిలోని (గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్) బతుకమ్మ కుంటను గ్రామస్తులు కిలోమీటరు దూరంలోని రైతుల బోరు బావుల నుంచి మోటర్ల ద్వారా నీటిని తరలిస్తున్నారు. పైడిపల్లి గ్రామశివారు ఎల్లమ్మగుట్ట సమీపంలోని కుంటలో సద్దులనాడు బతుకమ్మను వేసేది. అయితే, కేసీఆర్ హయాంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆ కుంట దగ్గర బతుకమ్మ (తల్లీబిడ్డల) విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సారి వర్షాభావ పరిస్థితుల కారణంగా నీరులేక వెలవెలబోయింది. దీంతో స్థానికులు ఆ కుంటలో గడ్డిని, పిచ్చిమొక్కలను పూర్తిగా తొలగించారు. రెండు రోజులుగా కిలోమీటరు దూరంలోని స్థానిక రైతుల వ్యవసాయ బావులతోపాటు, బోర్ల నుంచీ మోటర్ల ద్వారా బతుకమ్మ కుంటను నీటితో నింపుతున్నారు.
ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు
ఎప్పుడూ ఇట్లా కాలేదు. మేం చిన్నప్పుడు ఇరువై ఏండ్ల కింద ఇలాంటి పరిస్థితే వస్తే అప్పుడు ఇదే కాలువ (ఎస్సారెస్పీ కాలువ)లో ఉనుక, ఉసికె బస్తాలను వేసి నీటిని ఆపి బతుకమ్మలను సద్దులనాడు వేసినట్టు గుర్తు. మూడునాలుగేండ్ల దాకా కాలువనిండా నీరుపారుతుంటే సంబురమయ్యేది. కాలువలో పడవలేసుకొనిపోతే ఎంత బావుండో అనిపించేంత సంతోషంగా ఉండేది. కానీ, ఈ సారి బతుకమ్మలు వేసేందుకే నీళ్లులేవు. మా గ్రామంలోని ఆడబిడ్డల కోసం, మన సంస్కృతిని కాపాడటం కోసం ప్రభుత్వాల కోసం ఎదురుచూడటం కన్నా మా వంతుగా మేం స్వచ్ఛందంగా అందరం కలిసి ఇలా ఏర్పాటు చేసుకున్నం.
– సుంకరి ప్రశాంత్, ఆరేపల్లి, వరంగల్ జిల్లా
నీరు తక్కువ ఉన్నప్పుడు నింపుతాం
వర్షాలు తక్కువగా కొట్టినప్పుడు కుంటలో నీరు తక్కువ ఉంటుంది. అప్పుడు ఊరోళ్లం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటం. వెంటనే కొందరి సహకారంతో పక్కన ఉన్న వ్యవసాయ బావులు, బోర్ల నుంచి మోటర్ల సహాయంతో బతుకమ్మకుంటను పూర్తిగా నింపుతం. సద్దుల బతుకమ్మ పండుగ రోజున ఆడపడుచులు నిరాశకు గురికాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నం. ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడంతో ఊరోళ్లం కలిసి నీటిని నింపుతున్నం.
– జన్ను సారంగపాణి, పైడిపల్లి, వరంగల్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

