VTGCET 2023 | 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడగింపు
VTGCET 2023 | హైదరాబాద్ : సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో( Residential Schools ) 5వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణకు విధించిన గడువును మార్చి 20వ తేదీ వరకు పొడిగించారు.
VTGCET 2023 | హైదరాబాద్ : సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో( Residential Schools ) 5వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణకు విధించిన గడువును మార్చి 20వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రోస్( Ronald Ross ) గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఓసీ, బీసీ విద్యార్థులైతే 9 ఏండ్లు నిండి.. 11 ఏండ్లు వయస్సు దాటని వారు, ఎస్సీ, ఎస్టీలైతే 13 ఏండ్లు దాటకూడదు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలైతే 1.50 లక్షలు, పట్టణాలైతే రూ. 2 లక్షలు మించని విద్యార్థులు ప్రవేశాలకు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800 425 45678లో సంప్రదించాలని, www.tgcet.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. ఇదిలా ఉండగా ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 23న ఉదయం11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెలంగాణ వ్యాప్తంగా నిర్దేశించిన కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

