భూత్పూర్, అక్టోబర్ 17: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి ప్రతి గ్రామంలో ఓటర్ల మద్దతు రోజురోజుకూ పెరుగుతున్నది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు మద్దతుగా ఉంటామని భూత్పూర్ చౌలతండావాసులు మంగళవారం ప్రతిజ్ఞ చేశారు.
నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే ఆల వెంటే ఉంటామని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులందరూ పాల్గొన్నారు.