Banoth Madanlal | వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ గుండెపోటుతో కన్నుమూత
వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాణోత్ మదన్‌లాల్ (Banoth Madanlal) కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్ ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
వైరా: వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాణోత్ మదన్‌లాల్ (Banoth Madanlal) కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్ ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. గతవారం ఖమ్మంలోని ఆయన నివాసంలో వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు స్థానిక దవాఖానలో చేర్పించారు. అయితే మెరుగైన వైద్యం కోసం ఏఐజీ హాస్పిటల్‌కు తరలించగా పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మదన్ లాల్ మృతితో వైరా నియోజకవర్గ వ్యాప్తంగా విషాదఛాయలు నెలకొన్నాయి. పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్, ఇతర పార్టీల నాయకులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున వైరా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 2023 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. దీంతో వైరా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

