ఖైరతాబాద్, సెప్టెంబర్ 1: పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ డి మాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థులు, వివిధ విద్యార్థి సంఘాల సంయుక్త ఆధ్వర్యం లో ‘స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్.. అస్తిత్వం-నేటి సవాళ్లు-పరిషారం’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం లో ఆయన మాట్లాడారు. సింగపూర్‌లోని ఇ న్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తరహా లో రాష్ట్రంలో సిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం స్వాగతించదగ్గ విషయమేనని, అ యితే దాని పరిధి, అధికారాలు, పాలిటెక్నిక్ విద్యావ్యవస్థ మధ్య స్పష్టమైన విభజన ఉండాలని చెప్పారు.
యూజీసీ నిబంధనల ప్రకారం యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీకి డిగ్రీలు ప్రదానం చేసే అధికారం ఉన్నప్పటికీ, డిప్లొమా కోర్సులను నిర్వహించేందుకు సంబంధిత సాంకేతిక విద్యా నిబంధనలు, ఏఐసీటీఈ అనుమతులు అవసరమని తెలిపారు. అలాంటి అనుమతులు, చట్టపరమైన అంశాలను స్పష్టంగా పరిషరించకుండానే పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను సిల్ వర్సిటీకి అనుసంధానం చేయడం సరైన నిర్ణయం కాదని నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
శాంతియుతంగా తమ హకుల కోసం నిరసనలు చేపడుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై అరెస్టులు, ముందస్తు నిర్బంధాలు విధించడం సరికాదని రాష్ట్ర డీజీపీ ఆనంద్‌కు విజ్ఞప్తిచేశారు. లేబర్ డిపార్ట్మెంట్ పేరును ‘శక్తి’గా మార్చడంపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తూ, యథాతథంగా కొ నసాగించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో విద్యావ్యవస్థ నిర్వీర్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఆరోపించారు. ప్రభుత్వం జీవో 97 జీవోను రద్దు చేసేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టంచేశారు. తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ ప్రతినిధి ఎర్రవెల్లి జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, ఆజాద్, జనార్దన్, శ్రావణ్ పాల్గొన్నారు.