హైదరాబాద్, అక్టోబరు 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎన్నికల నామినేషన్లు ప్రారంభమయ్యే అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన పూర్తి కాగా శుక్రవారం ఆదిలాబాద్, ఆ తరువాత కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు.
దసరా తరువాత మిగిలిన జిల్లాలను సందర్శిస్తారని సమాచారం. ఈవీఎంలు, ఎన్నికల నియామవళి అమలు, పోలింగ్ స్టేషన్లు, శాంతి భద్రతలు, తనిఖీలు, కౌంటింగ్ ఏర్పాట్లు తదితర వాటిపై కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సమీక్షిస్తారు.