Vemulawada | వేములవాడ ఏరియా ఆస్పత్రిలో జడ్జి ప్రసవం.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన న్యాయమూర్తి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా దవాఖానలో వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జ్యోతిర్మయి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. హైదరాబాద్‌కు చెందిన జ్యోతిర్మయి ఇటీవలే వేములవాడకు బదిలీపై వచ్చారు.
Vemulawada | వేములవాడ, ఆగస్టు 16: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా దవాఖానలో వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జ్యోతిర్మయి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. హైదరాబాద్‌కు చెందిన జ్యోతిర్మయి ఇటీవలే వేములవాడకు బదిలీపై వచ్చారు. మంగళవారం వరకు ఆమె విధుల్లో ఉండగా, బుధవారం ఒకసారిగా పురిటినొప్పులు రావడంతో ఏరియా దవాఖానలో చేరారు. వైద్యురాలు చైతన్య సుధా ఆమెకు సాధారణ ప్రసవం చేయగా, ఆడ శిశువుకు జన్మనిచ్చారు.
తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యురాలు తెలిపారు. దవాఖానలో మొదటి కాన్పులో భాగంగా ఆడ శిశువుకు జన్మనిచ్చిన తల్లికి ఉయ్యాలను బహుమతి ఇస్తున్నామని, న్యాయమూర్తికి సైతం అందజేశామని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహేశ్‌రావు తెలిపారు. దవాఖానలో అందుతున్న వైద్య సేవలపై న్యాయమూర్తి ఎంతో సంతృప్తి చెందారని ఆయన పేర్కొన్నారు.
Read More :
ఆడపిల్ల పుడితే ఊయల గిఫ్ట్.. వేములవాడ ఏరియా ఆస్పత్రి వినూత్న కానుక
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

