నేడు వసంత పంచమి.. బాసర సరస్వతి ఆలయంలో భక్తుల రద్దీ
Vasantha Panchami | చదువుల తల్లి కొలువై ఉన్న బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది. వసంత పంచమి కావడంతో ఆలయానికి భారీగా తరలి వచ్చారు. శనివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారి
నిర్మల్: చదువుల తల్లి కొలువై ఉన్న బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది. వసంత పంచమి కావడంతో ఆలయానికి భారీగా తరలి వచ్చారు. శనివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లలో బారులు దీరారు. వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకు మంచి భవిష్యత్ ఉంటుందని భక్తుల నమ్మకం. దీంతో పెద్దఎత్తున భక్తులు తమ పిల్లలకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నారు.
వసంత పంచమి ఉత్సవాలకు జ్ఞాన సరస్వతి ఆలయాన్ని అధికారులు ముస్తాబు చేశారు. తెల్లవారుజామున 2 గంటలకు అభిషేకంతో వేదపండితులు ఉత్సవానికి అంకురార్పణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చదువుల తల్లికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మూడు రోజులపాటు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా మంగళ వాయిద్య సేవ, సుప్రభాత సేవ, అభిషేకం, పూర్ణాహుతి, మహావిద్యా హోమం, బలిదానం, గణపతి హోమం, చండీయాగం, కుంకుమార్చన వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర భారతదేశం నుంచి భక్తులు పెద్ద ఎత్తున బాసరకు రానున్నారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులు ఇబ్బందిపడకుండా మండపాలు, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

