హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని, అప్పటి వరకు ఇకడి హైకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు అమలును నిలుపుదల చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు సర్టిఫైడ్ కాపీ అందుబాటులోకి రాలేదని, అది వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని తెలిపారు. వాదనల తర్వాత హైకోర్టు వనమా మధ్యంతర పిటిషన్పై ఉత్తర్వులను తర్వాత వెలువరిస్తామని పేర్కొన్నది.