హైదరాబాద్ : రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ( MP Vaddiraju ) ఫ్లోర్ లీడర్ ( BRS Floor Leader ) గా నియమితులయ్యారు. రాజ్యసభ సభ్యుడుగా, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న కేఆర్ సురేష్ రెడ్డి పదవీకాలం ముగియడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్రను ఫ్లోర్ లీడర్‌గా నియామకం పట్ల తెలంగాణ మున్నూరు కాపు సంఘం నాయకులు పార్టీ అధినేత కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. వద్దిరాజు నియామకం బీసీల, తెలంగాణ హక్కుల సాధనలో కీలకంగా మారుతారని సంఘం అధ్యక్షుడు సర్దార్ పుటం పురుషోత్తం పటేల్ అన్నారు.
వద్దిరాజు రవిచంద్ర సేవలను గుర్తించి కీలకమైన బాధలు అప్పగించిన కేసీఆర్‌కు మున్నూరు కాపు సమాజం కృతజ్ఞతలు తెలుపుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావలసిన రాజ్యాంగపరమైన హక్కుల సాధనలో వద్దిరాజు కృషి మరింత పెరగడానికి అవకాశం దక్కిందని పేర్కొన్నారు.