హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీసీటీజీవోఏ) అధ్యక్షుడిగా వీ శ్రీనివాసరెడ్డి ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో టీసీటీజీవోఏ నూతన కమిటీ ఎన్నికైంది.
ప్రధాన కార్యదర్శిగా ఎన్ దేవేందర్, ఉపాధ్యక్షులుగా కే మురళి మోహన్, సీ సంపత్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ(జనరల్)గా ఎస్ భాస్కర్, స్పోర్ట్స్ సెక్రటరీగా పీ రామలక్ష్మయ్య, కోశాధికారిగా ఎస్ గిరిధర్, జాయింట్ సెక్రటరీలుగా బీ రాజు(సిటీ), డీ శ్రీనివాస్ (5వ జోన్)లు ఎన్నికయ్యారు. వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తానని శ్రీనివాసరెడ్డి తెలిపారు.