టెస్కాబ్ను సందర్శించిన యూపీ బృందం
రాష్ట్ర సహకార వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం తీసుకొన్న చర్యలపై ఉత్తరప్రదేశ్ సహకార బ్యాంకు అధికారుల బృందం అధ్యయనం చేసింది. ఈ బృందం సోమవారం టెస్కాబ్ కార్యాలయాన్ని సందర్శించింది.
- సహకార బ్యాంకుల బలోపేతంపై అధ్యయనం
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సహకార వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం తీసుకొన్న చర్యలపై ఉత్తరప్రదేశ్ సహకార బ్యాంకు అధికారుల బృందం అధ్యయనం చేసింది. ఈ బృందం సోమవారం టెస్కాబ్ కార్యాలయాన్ని సందర్శించింది. దేశవ్యాప్తంగా సహకార బ్యాంకుల బలోపేతానికి, బ్యాంకుల మధ్య సమన్వయం పెంపొందించేందుకు రిజర్వ్ బ్యాంక్ చర్యలు చేపట్టింది. సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో దేశంలోనే పటిష్ఠంగా ఉన్న తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (టెస్కాబ్)ను సందర్శించాలని పలు రాష్ర్టాలకు సూచించింది. ఆర్బీఐ సూచనల మేరకు యూపీ బృందం సోమవారం టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావుతో సమావేశమై సాంకేతిక వినియోగం, ఆడిటింగ్ విధానాలపై తెలుసుకున్నది. బ్యాంకులో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్‌ను బృందం సభ్యులు సందర్శించారు. సైబర్ దాడుల నివారణ చర్యలను టెస్కాబ్ ఎండీ నేతి మురళీధర్ యూపీ బృందానికి వివరించారు. యూపీ బృందంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు బీఎల్ మీనా, బీ చంద్రకళ, వీకే మిశ్రా తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Prasad Yallapu | గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ‘ప్రొడక్షన్ నంబర్ 1’ చిత్రం.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం!
Psoriasis | సోరియాసిస్ అంటే ఏమిటి.. ఎలా వస్తుంది.. లక్షణాలు ఎలా ఉంటాయి..?
పులివెందుల పులినని చెప్పుకునే జగన్.. ఓటు వేయకుండానే పిరికిపందలా పారిపోయారు.. అచ్చెన్నాయుడు ఎద్దేవా
అన్నాచెల్లెలుగా పేర్కొంటూ అద్దె ఇంట్లో నివసించిన జంట.. ఉరి వేసుకున్న యువకుడు, ప్రియురాలు గదిలో నిర్బంధం
కట్టిపడేసే చూపులు.. కిర్రెక్కించే పోజులు.. బ్లూ శారీలో ప్రణవి మనుకొండ హాట్ ఫొటోలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

