యాదాద్రిలో అమ్మవారికి ఊంజల్ సేవ
అమ్మవారికి ఊంజల్ సేవ | యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవను కోలహలంగా నిర్వహించారు.

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవను కోలహలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా మహిళా భక్తులు పాల్గొనే సేవలో భక్తులు పాల్గొని తరించారు. సకల సంపదల సృష్టికర్త..తనను కొలిచిన వారికి నేనున్నానంటూ అభయ హస్తమిచ్చి కపాడే లక్ష్మీ అమ్మవారికి విశేష పుష్పాలతో ఆలంకారం జరిపారు. బాలాలయం ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విడుతలుగా 516 రూపాయల టికెట్ తీసుకున్న భక్తులకు సువర్ణపుష్పార్చన జరిపించారు.
బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. దీన్నే సువర్ణపుష్పార్చనగా భక్తులు అత్యంత ప్రీతికరంగా నిర్వహిస్తారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణ జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు. ఉప ప్రధానార్చకులు ఆధ్వర్యంలోని అర్చక బృందం వైభవంగా ఈ పూజలు నిర్వహించారు.
మంగళహారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మంటపంలోని ఊయలతో శయనింపు చేయించారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటలతో కోలాహలంగా కొనసాగింది.


ఇవి కూడా చదవండి..
పసిబిడ్డను పొట్టనబెట్టుకున్న అమ్మమ్మ
డ్రైవర్ లేకుండానే నడిచిన ట్రాక్టర్.. వీడియో
విషాదం : పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య
ఆ పథకాలన్నీ గత బడ్జెట్‌లోనివే : గుత్తా సుఖేందర్ రెడ్డి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

