యూనివర్సిటీలు ఎన్‌ఆర్‌ఎఫ్‌కు సమర్పించాలి
ఉన్నత విద్యలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని, ప్రత్యేకంగా పరిశోధనలను ప్రోత్సహించేందుకు నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్‌ను (ఎన్ఆర్ఎఫ్) ప్రారంభించామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్‌కుమార్ చెప్పా రు.
- ఉన్నత విద్యలో జీఈఆర్‌ను 50 శాతానికి చేర్చుతాం
- యూజీసీ చైర్మన్ జగదీశ్‌కుమార్
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఉన్నత విద్యలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని, ప్రత్యేకంగా పరిశోధనలను ప్రోత్సహించేందుకు నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్‌ను (ఎన్ఆర్ఎఫ్) ప్రారంభించామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్‌కుమార్ చెప్పా రు. వర్సిటీలు రూపొందించే రిసెర్చ్ ప్రాజెక్టులను ఎన్‌ఆర్‌ఎఫ్‌కు సమర్పిస్తే, ఆయా ప్రాజెక్ట్‌లకు నిధులిస్తామని వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌కు వచ్చిన జగదీశ్‌కుమార్ ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. వర్సిటీలకు యూజీసీ నిధులివ్వడం లేదన్న ప్రశ్నపై స్పందించిన జగదీశ్‌కుమార్.. ప్రభు త్వ, ప్రైవేట్ యూనివర్సిటీలు అనే తేడాల్లేకుండా రిసెర్చ్‌ను ప్రోత్సహించే విద్యాసంస్థలకు నిధులు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఆయన వెల్లడించిన మరికొన్ని వివరాలు.
మారిన రిసెర్చ్ స్వరూపం
ఇటీవల పరిశోధనల స్వరూపం మారిపోయింది. మల్టీ డిసిప్లీనరి రిసెర్చ్ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఒకప్పుడు బయాలజీ, కెమికల్, క మ్యూనికేషన్ ఇంజినీర్లు అని వేర్వేరుగా ఉండేవారు. ఇప్పుడు మల్టీ డిసిప్లీనరీ రిసెర్చ్ అవసరాలు పెరిగాయి. డ్రోన్ ఎగరాలంటే కమ్యూనికేషన్, కంట్రోల్, సర్క్యూట్ ఇంజినీర్ల అసరరం ఏర్పడింది. ఇదే మల్టీ డిసిప్లినరీ రిసెర్చ్‌కు అర్థం. దీనిని వర్సిటీలు ప్రోత్సహించాలి. అప్పుడే ఫలితాలొస్తాయి. ఉన్నత విద్యలోని ఫ్యాకల్టీకి శిక్షణ ఇచ్చేందుకు మాలవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రారంభించాం. జాతీయంగా ఉన్నత విద్యలోని 15 లక్షల మంది అధ్యాపకులు, ఆచార్యులకు శిక్షణ ఇచ్చేందుకు ఈ మిషన్‌ను తలపెట్టాం. కాలేజీలు, వర్సిటీల్లోని ఫ్యాకల్టీ పో ర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వీలున్న సమయంలో శిక్షణ పొందవచ్చు. వచ్చే మూడేండ్లలో దేశవ్యాప్తంగా 15 లక్షల మందికి శిక్షణ ఇస్తాం.
ఉన్నత విద్యలో చేరుతున్నది 4.1 శాతమే
ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) 27 శాతంగా ఉన్న ది. పాఠశాల విద్యలో ఏటా 26 కోట్ల మంది నమోదవుతుండగా, అదే ఉన్నత విద్యలో కేవలం 4.1 కోట్లు మాత్రమే న మోదవుతున్నారు. మిగతా వారంతా ఉ న్నత విద్య వరకు రాకుండానే డ్రాపౌట్ అవుతున్నారు. జీఈఆర్‌ను 50 శాతానికి పెంచేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తు న్నాం. వచ్చే ఐదేండ్లలో జీఈఆర్‌ను డబు ల్ అంటే 8.2 కోట్లకు పెంచాలనుకుంటున్నాం. జాతీయ విద్యావిధానంతో (ఎన్ఈపీ) అనేక లాభాలున్నాయి. వర్సిటీ లు ఎంత త్వరగా ఎన్ఈపీని అమలుచేస్తే అంత లాభం. తెలంగాణ బిడ్డగా రాష్ట్రం లో విద్యారంగ అభివృద్ధికి సహకరిస్తా.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

