తెలంగాణ పల్లె ‘ముఖరా కె’పై జాతీయ స్థాయిలో ప్రశంసల జల్లు
హైదరాబాద్ : దేశంలోనే అత్యుత్తమంగా నిలిచి.. మన తెలంగాణలో ఆ గ్రామం మరోసారి దేశ దృష్టిని ఆకర్షించింది. దేశానికి మరోసారి ఆదర్శంగా నిలిచింది. కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆ గ్రామాన్ని ట్వీట్ చేస్తూ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ లోగోని ప్రభుత్వ భవనాల గోడల మీద ఆవిష్కరించడంలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా కె గ్రామం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఈ అలంకరణ దేశానికి గొప్ప సంకల్పాన్ని ప్రతిబింబింప చేస్తోందని పేర్కొంది. దీనిపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రీ ట్వీట్ చేశారు.
‘అవును, నిజమే! ఆదర్శ గ్రామాల అభివృద్ధికి తెలంగాణ లోని ముఖరా కె గ్రామ పంచాయతీ అనేక మైలురాళ్లను సృష్టిస్తోంది. దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామ పంచాయతీలు ఎలా ఉండాలి? అనే అంశంపై వారి వినూత్న సృజనాత్మక ఆలోచనలు చేస్తున్న గ్రామ పరిపాలకులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి, ప్రజలకు అభినందనలు’ అంటూ గ్రామ పాలక వర్గానికి, సిబ్బందికి, అధికారులు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా సశక్త్ చాయత్ సతత్ వికాస్ పేరుతో ఆయా లోగోలను గ్రామ పంచాయతీ భవన ప్రహరీ గోడలపై పేయింటింగ్స్ వేశారు. అలాగే, తెలంగాణ విరామం లేని నిరంతర పంచాయతీ అభివృద్ధి, బలమైన పంచాయతీ, సుస్థిరమైన అభివృద్ధి ట్యాగ్లైన్లను చిత్రించారు. ఈ పెయింటింగ్స్ ప్రస్తుతం దేశాన్ని, కేంద్రాన్ని ఆకర్షిస్తున్నాయి. గ్రామ సర్పంచ్ మీనాక్షి, ఎంపీటీసీ సుభాష్ గాడ్ గే, ఇతర వార్డు సభ్యులు, సిబ్బంది, అధికారులు, ప్రజలకు జాతీయస్థాయిలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
అవును, నిజమే! ఆదర్శ గ్రామాల అభివృద్ధికి తెలంగాణలోని ముక్రా- కె గ్రామ పంచాయతీ అనేక మైలు రాళ్లను సృష్టిస్తోంది. దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామ పంచాయతీలు ఎలా ఉండాలి? అనే అంశంపై వారి వినూత్న సృజనాత్మక ఆలోచనలు చేస్తున్న గ్రామ పరిపాలకులు, సిబ్బందికి,ప్రజలకు అభినందనలు! 💐@KTRTRS. https://t.co/IAidP13CcC
— Errabelli DayakarRao (@DayakarRao2019) September 4, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

