Telangana Minister Komati Reddy | ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి అటవీ అనుమతులు.. మంత్రి కోమటిరెడ్డి
Telangana Minister Komati Reddy | రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టి రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో ఉత్తర భాగానికి అటవీ పరమైన అనుమతులను కేంద్రం మంజూరు చేసింది.
Telangana Minister Komati Reddy | రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టి రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో ఉత్తర భాగానికి అటవీ పరమైన అనుమతులను కేంద్రం మంజూరు చేసింది. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తరభాగంలో నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న అటవీ భూములకు సంబంధించి అనుమతి ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర అటవీశాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ కైలాష్ భీమ్ రావ్ భవర్ లేఖ రాశారని రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో అటవీ అనుమతులు కోరుతూ గత జూలై 26న కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. గత సెప్టెంబర్ 19న జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సూత్రప్రాయంగా ఆమోదించినట్లు కేంద్రం సమాచారం ఇచ్చిందని మంత్రి కోమటి రెడ్డి తెలిపారు. దీని ప్రకారం మెదక్ జిల్లాలో 35.5882 హెక్టార్లు, సిద్దిపేట జిల్లాలో 28.2544 హెక్టార్లు, యాదాద్రి-భువనగిరి జిల్లాలో 8.511 హెక్టార్లతోపాటు మొత్తం మూడు జిల్లాల్లో కలిపి 72.3536 హెక్టార్ల అటవీ భూమిని భారత్‌మాల పరియోజన ఫేజ్-1 కింద హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ (హెచ్ఆర్ఆర్ఆర్) నిర్మాణానికి అనుమతిస్తున్నట్లు లేఖలో తెలిపారన్నారు. వివిధ నిబంధనల అమలుకు అనుగుణంగా అటవీ అనుమతులు లోబడి భూసేకరణ చేస్తామని పర్యావరణ మంత్రిత్వ శాఖకు తెలియజేసినట్లు మంత్రి తెలిపారు. అటవీ అనుమతుల సమస్య తీరడంతో ఇక ఎన్.హెచ్.ఏ.ఐ వద్ద పెండింగ్ లో ఉన్న టెక్నికల్ అప్రూవల్ వస్తే.. వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుందని మంత్రి వివరించారు.
ఇప్పటి వరకూ ఆర్ఆర్ఆర్ నిర్మాణం కోసం 90 శాతం భూసేకరణ పూర్తయ్యిందని మంత్రి కోమటి రెడ్డి తెలిపారు. కొన్ని చిన్న కోర్టు కేసులను త్వరలో పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటామని తెలిపారు. ఇప్పుడు కేంద్ర అటవీ పర్యావరణశాఖ అనుమతులు రావడం పట్ల హర్షంవ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

