హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్‌కుమార్ శుక్రవారం రాష్ట్రంలో పర్యటించారు. తొలుత హైదరాబాద్ హబ్సీగూడలో నిర్వహించిన కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా(కోబ్సే) సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన సోమాజిగూడలోని రాజ్‌భవన్ స్కూల్‌ను సందర్శించారు. ఏఎక్స్ఎల్ ల్యాబ్‌ను సందర్శించి ఎఫ్‌ఎల్‌ఎన్‌లో విద్యార్థుల ప్రగతిని పరిశీలించారు. అనంతరం పలు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో జూమ్ మీటింగ్‌లో మాట్లాడారు. ఇక కోబ్సే సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన పలు రాష్ర్టాలు, నేపాల్, భూటాన్ దేశాల విద్యాబోర్డుల ప్రతినిధులు నాంపల్లిలోని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కమాండ్ కంట్రోల్ సెంటర్, విద్యార్థుల హాజరు నమోదుకు అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు.