హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 27 (నమస్తే తెలంగాణ): వినూత్న ఆలోచనలతో స్టార్టప్‌లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? మీ ఆలోచనలకు అనుగుణంగా ప్రొటోటైప్ అభివృద్ధి చేసే ఆలోచన ఉన్నదా? మీ కోసమే టీ హబ్ ఆధ్వర్యంలో బ్లిడ్జ్ పేరుతో కొత్తగా సార్టప్ ప్రోత్సాహక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
45 రోజుల్లో పనిచేసేందుకు అనుకూలమైన నమూనా రూపొందించే సామర్థ్యం, నైపుణ్యం ఉన్నవారు దీనిలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. (https://bit.ly/42e6m3m) లింకులో సంప్రదించాలని, విద్యార్థులతో పాటు ఔత్సాహిక వ్యాపారవేత్తలు, నిపుణులు తమ ఆవిష్కరణలను ప్రొటోటైప్లుగా మార్చడానికి అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.