హైదరాబాద్ వాతావరణం బాగున్నది
హైదరాబాద్లో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్గా పనిచేసిన అండ్రూ ఫ్లెమింగ్ ఐదేండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకొన్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లి పోతున్న నేపథ్యంలో ఆయన ట్విట్టర్ వేదిగా తన అనుభవాలను పంచుకొన్నారు. హైదరాబాద్లో ఐదేండ్లపాటు ఎంతో ఉత్సాహంగా గడిపానని
- యూకే డిప్యూటీ హై కమిషనర్ అండ్రూ ఫ్లెమింగ్
- పదవీకాలం పూర్తి చేసుకొని బదిలీపై బెంగళూరుకు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్గా పనిచేసిన అండ్రూ ఫ్లెమింగ్ ఐదేండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకొన్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లి పోతున్న నేపథ్యంలో ఆయన ట్విట్టర్ వేదిగా తన అనుభవాలను పంచుకొన్నారు. హైదరాబాద్లో ఐదేండ్లపాటు ఎంతో ఉత్సాహంగా గడిపానని, ఇక్కడి వాతావరణం ఎంతో బాగుందని ప్రశంసించారు. హైదరాబాద్ నుంచి బదిలీపై బెంగళూరుకు వెళ్తున్నానని ట్విట్టర్లో తెలిపారు.
ఈ సందర్భంగా నగరంలో యూకే కార్యాలయ ఉద్యోగులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్లో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన రవిని ప్రత్యేకంగా శాలువాతో సత్కరించారు. రెండు తెలుగు రాష్ర్టాలకు డిప్యూటీ హై కమిషనర్ (డీహెచ్సీ)గా ఆగస్టు 1వ తేదీ చివరి రోజు అని, ఐదేండ్ల పదవీకాలం ముగుస్తున్న రోజున, తియ్యని తెలుగులో నా ఆఖరి సందేశం ‘అందరికీ నా ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

