నాగర్ కర్నూల్ : రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో(Bikes collided) ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన నాగర్ కర్నూల్(Nagar Kurnool) జిల్లా కేంద్రంలోని రవి థియేటర్ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు యువకులకు తీవ్రంగా గాయపడ్డారు(Seriously injured). గమనించిన స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా, ఇరువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న డాక్టర్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.