TSPSC | టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ కేసు.. దంపతులు అరెస్ట్
TSPSC | హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ దర్యాప్తులో సిట్ మరో కీలక సమాచారాన్ని రాబట్టింది. ప్రశ్నపత్రాల లీకేజీలో కీలక నిందితుడైన ప్రవీణ్ నుంచి డీఏవో పేపర్‌ను కొనుగోలు చేసిన దంపతులను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఖమ్మంలో కార్ల వ్యాపారం నిర్వహించే సాయిలౌకిక్, సుష్మిత దంపతులు. సుష్మిత హైదరాబాద్‌లో సాప్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. టీఎస్పీఎస్సీ గ్రూప్ -1, డీఏవో నోటిఫికేషన్లు విడుదల కావడంతో తన సాఫ్ట్వేర్ ఉద్యోగానికి సెలవు పెట్టి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయింది.
TSPSC | హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ దర్యాప్తులో సిట్ మరో కీలక సమాచారాన్ని రాబట్టింది. ప్రశ్నపత్రాల లీకేజీలో కీలక నిందితుడైన ప్రవీణ్ నుంచి డీఏవో పేపర్‌ను కొనుగోలు చేసిన దంపతులను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఖమ్మంలో కార్ల వ్యాపారం నిర్వహించే సాయిలౌకిక్, సుష్మిత దంపతులు. సుష్మిత హైదరాబాద్‌లో సాప్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. టీఎస్పీఎస్సీ గ్రూప్ -1, డీఏవో నోటిఫికేషన్లు విడుదల కావడంతో తన సాఫ్ట్వేర్ ఉద్యోగానికి సెలవు పెట్టి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయింది.
గతేడాది అక్టోబర్‌లో జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కూడా రాసింది. అయితే ఆమె ఓఎంఆర్ షీట్లో హాల్‌టికెట్ నంబర్ రాంగ్ బబ్లింగ్ చేసింది. దీంతో పరీక్షల ఫలితాలలో ఆమె పేపర్‌ను టీఎస్పీఎస్సీ అనర్హత జాబితాలో ఉంచింది. తాను ఓఎంఆర్ షీట్లో రాంగ్ బబ్లింగ్ చేశానని, దానిని పరిగణలోకి తీసుకొని తనకు న్యాయం చేయాలంటూ ఆమె టీఎస్పీఎస్సీకి వచ్చి అధికారులను కలిసింది. అధికారులను కలిసే క్రమంలో కార్యదర్శి అనితా రాంచంద్రన్ పీఏగా పనిచేసిన ప్రవీణ్‌కుమార్‌ను కూడా కలిశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ ముందు తన ఆవేదనను వ్యక్తం చేసింది. గ్రూప్-1 పరీక్ష ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యేదాన్ని, కానీ రాంగ్ బబ్లింగ్ తనకు కష్టాలు తెచ్చిపెట్టిందని, తాను డీఏఓ పరీక్షకు సిద్దమవుతున్నాను, టీఎస్పీఎస్సీ చుట్టూ తిరగడంతో సమయం వృధా అవుతుందంటూ ప్రవీణ్‌కు తెలిపింది.
దీంతో ప్రవీణ్ తన వద్ద డీఏఓ మాస్టర్ ప్రశ్న పత్రం ఉందని, మీకు కావాలంటే ఇస్తానంటూ చెప్పాడు. దీంతో సుష్మ ఈ విషయంపై తన భర్తతో ఆలోచించి, ప్రవీణ్‌తో బేరం ఆడారు. ఇందులో భాగంగా ముందుగా రూ. 6 లక్షలు ఇచ్చి, పరీక్ష ఫలితాలు వచ్చిన తరువాత మిగతా రూ. 4 లక్షలు ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ప్రశ్నా పత్రం ప్రింటెడ్ కాపీని సుష్మ దంపతులకు అందజేయడంతో, లౌకిక్ తన కార్ల కంపెనీ ఖాతా నుంచి రూ. 6 లక్షలు ప్రవీణ్ ఖాతాలోకి బదిలీ చేశాడు. ఫిబ్రవరి 26వ తేదీన ఈ పరీక్ష జరిగింది. టీఎస్ఎపీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఈ పరీక్షను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

