విద్యుదాఘాతంతో ఇద్దరు విద్యార్థుల మృతి
విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృత్యువాతపడిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సీఐ మల్లికార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ అత్తాపూర్‌కు చెందిన మోక్షచరణ్ (20), బల్కంపేట ప్రాంతానికి చెందిన యశ్వంత్(20) మొయినాబాద్ పరిధి చిలుకూరు రెవెన్యూలోగల కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతున్నారు. మోక్షచరణ్, యశ్వంత్‌తోపాటు మరోముగ్గురు స్నేహితులు రోజూ ఇంటి నుంచి కళాశాలకు వెళ్లొస్తుంటారు.
- పంట చేనుకు కరెంట్ పెట్టిన రైతుపై కేసు నమోదు
మొయినాబాద్, అక్టోబర్ 31: విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృత్యువాతపడిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సీఐ మల్లికార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ అత్తాపూర్‌కు చెందిన మోక్షచరణ్ (20), బల్కంపేట ప్రాంతానికి చెందిన యశ్వంత్(20) మొయినాబాద్ పరిధి చిలుకూరు రెవెన్యూలోగల కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతున్నారు. మోక్షచరణ్, యశ్వంత్‌తోపాటు మరోముగ్గురు స్నేహితులు రోజూ ఇంటి నుంచి కళాశాలకు వెళ్లొస్తుంటారు.
మరో ముగ్గురు మొయినాబాద్‌లోని హాస్టల్లో ఉంటూ కళాశాలకు వెళ్తుంటారు. వీరంతా సివిల్ ఇంజినీరింగ్ చేస్తున్నారు. కళాశాలలో శనివారం టెక్నికల్ ఫెస్ట్, వారి స్నేహితుడు అరుణ్ పుట్టినరోజు ఉండటంతో పార్టీ చేసుకుందామని అనుకున్నారు. శుక్రవారం మోక్షచరణ్, యశ్వంత్‌తోపాటు మరో ముగ్గురు స్నేహితులు కలిసి హైదరాబాద్ ఆర్మీ మైసమ్మ (బండ్లగూడ) వద్ద బీర్లు తీసుకుని మొయినాబాద్‌లో హాస్టల్లో ఉండే స్నేహితుల వద్దకు వెళ్లారు. బీర్లు, స్నాక్స్ తీసుకుని ఎనిమిది మంది స్నేహితులు నాలుగు బైక్‌లపై పెద్దమంగళారం వెళ్లే రోడ్డు పక్కన ఉన్న సందులోకి వెళ్లి మద్యం సేవించారు.
అర్ధరాత్రి ఒంటి గంటకు పోలీసు పెట్రోలింగ్ వాహనం అటువైపు రాగా భయాందోళనకు గురైన విద్యార్థులు బైక్‌లపై పక్కనే ఉన్న పంట పొలాలవైపు వెళ్లారు. పందుల నుంచి పంటను కాపాడుకోవడానికి పెద్దమంగళారం గ్రామానికి చెందిన రైతు బొలించెరువు రాజిరెడ్డి విద్యుత్తు ఫెన్సింగ్ పెట్టారు. అటు వైపు వెళ్లిన మోక్ష చరణ్, యశ్వంత్ పంటపొలాలకు ఉన్న కంచెకు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యారు. వారిని చూసిన మిగతా స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారిని దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందారని వైద్యులు నిర్ధారించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

