పట్టణాలకు కొత్త సొబగులు
రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం తెలంగాణ పట్టణ ఆర్థిక వనరుల మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ) ద్వారా భారీగా నిధులు కేటాయిస్తున్నది. దీంతో పట్టణాలు కొత్త సొబగులతో ఆహ్లాదకరంగా మారుతున్నాయి. స్వరాష్ట్రం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సంఖ్య 142కి పెరిగింది
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు
పెద్ద ఎత్తున నిధులు సమకూర్చిన టీయూఎఫ్ఐడీసీ
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం తెలంగాణ పట్టణ ఆర్థిక వనరుల మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ) ద్వారా భారీగా నిధులు కేటాయిస్తున్నది. దీంతో పట్టణాలు కొత్త సొబగులతో ఆహ్లాదకరంగా మారుతున్నాయి. స్వరాష్ట్రం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సంఖ్య 142కి పెరిగింది. దేశంలో పట్టణ జనాభా వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నది. ఈ నేపథ్యంలో పట్టణ ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తున్నది. 2014లో ఏర్పాటైన టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.3,809 కోట్లతో అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నది. రోడ్లు, సెంట్రల్ లైటింగ్, ముఖ్యమైన కాలువలు, చెరువుల సుందరీకరణ, పారుల అభివృద్ధికి సంబంధించిన 2,928 పనుల కోసం ఇప్పటివరకు 117 పట్టణ స్థానిక సంస్థలకు రూ.3,219 కోట్లు కేటాయించింది. వీటిలో రూ.690 కోట్ల విలువైన 930 పనులు పూర్తయ్యాయి. మరో రూ.862 కోట్ల విలువైన 741 పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన రూ.998 కోట్ల విలువైన 1,257 పనులు టెండర్ దశలో ఉన్నాయి.
ప్రణాళికాబద్ధంగా..
రాష్ట్రంలోని 12 నగరాల్లో 100 శాతం మురుగునీటి పారుదల నిర్వహణ లక్ష్యంగా అధికారులు పటిష్ఠ కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని పౌరులకు మెరుగైన వసతులు కల్పించేందుకు పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. నిధుల లభ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రాథమ్యాలవారీగా పనులు చేస్తున్నారు. టీయూఎఫ్ఐడీసీ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్నగర్, మిర్యాలగూడ, సూర్యాపేట, నల్లగొండ, ఆదిలాబాద్, సిద్దిపేట తదితర 12 నగరాలు, పట్టణాల్లో 2015-16, 2016-17, 2017-20 సంవత్సరాలకు రూ.1,616 కోట్లతో రూపొందించిన రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నారు. వివిధ పట్టణ స్థానిక సంస్థల పరిధిలో నీటి సరఫరా, మురుగునీటి పారుదల, పార్కుల అభివృద్ధికి మొత్తం రూ.1,666 కోట్లతో 66 పనులు చేపట్టారు. వీటిలో 56 పనులు పూర్తయ్యాయి. 10 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 2.40 లక్షల ఇండ్లకు నీటి సరఫరా కనెక్షన్లు, 2 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 55 వేల భూగర్భ డ్రైనేజీ కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి.
టీయూఎఫ్ఐడీసీ ద్వారా చేపట్టిన ప్రధాన పనులు
- రూ.72.68 కోట్లతో సిద్దిపేట పట్టణంలో భూగర్బ డ్రైనేజీ ప్రాజెక్టు
- రూ.75.76 కోట్లతో సిరిసిల్ల పట్టణంలో తాగునీటి సరఫరా ప్రాజెక్టు
- రూ.160.05 కోట్లతో నిజామాబాద్ పట్టణంలో మురుగునీటి సరఫరా ప్రాజెక్టు
- రూ.81.41 కోట్లతో సూర్యాపేట పట్టణంలో డ్రైనేజీ ప్రాజెక్టు
- రూ.50 కోట్లతో వివిధ పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఎఫ్ఎస్టీపీల ఏర్పాటు
- రూ.40 కోట్లతో నాలుగు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో వేర్వేరు అభివృద్ధి పనులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- development
- Funds
- TUFIDC
- urban
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

