దళిత కుటుంబాల్లో వెలుగులు
- వర్సిటీ విద్యార్థులకూ వర్తింపజేయాలి
- ‘దళితబంధు-ప్రగతి పథం’ సదస్సులో టీయూ వీసీ రవీందర్గుప్తా

డిచ్పల్లి, ఆగస్టు 16: దళితబంధు పథకం దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపనున్నాయని తెలంగాణ యూనివర్సిటీ వీసీ డీ రవీందర్గుప్తా పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోగల టీయూలోని సెమినార్ హాలులో తెలంగాణ ప్రాంత సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిశోధన అధ్యయన కేంద్రం ఆధ్వర్యం లో ‘దళితబంధు-ప్రగతిపథం’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. వీసీ రవీందర్గుప్తా మాట్లాడుతూ.. ఏ వర్గమైనా ఆర్థిక ఎదుగుదలతోనే ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటుందన్నారు. ఆర్థిక స్వావలంబనతోనే జీవన ప్రమాణాలు పెంపొందించుకోగలుగుతామని తెలిపారు. హుజూరాబాద్ తర్వాత నిజామాబాద్లో కూడా దళితబంధు పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఈ పథకం ద్వారా టీయూలోని దళిత విద్యార్థులకు పరిశోధనా వనరులు అందించే అవకాశాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరా రు.
నానో టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్, కెమిస్ట్రీ, ఫార్మా కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ప్రోగ్రామిం గ్ సైన్స్ వంటి అత్యాధునిక శాస్త్ర పరిజ్ఞానంతో దళిత పరిశోధకులు దళితబంధు వనరుల ద్వారా లబ్ధిపొందే అవకాశం ఉంటుందని వివరించా రు. ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య పీ కనకయ్య మాట్లాడుతూ.. దళితుల ఆర్థిక ఆత్మగౌరవానికి ప్రతీకగా దళిత బంధును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ పీ సంపత్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ప్రిన్సిపాల్ డాక్టర్ వాసం చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

