Tirumala | తిరుమల కొండపైకి కాలినడకన 116 ఏళ్ల వృద్ధురాలు.. విషయం తెలిసి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
Tirumala | తిరుమల శ్రీవారి దర్శనం కోసం కాలినడకన వచ్చిన 116 ఏళ్ల వృద్ధురాలు నవనీతమ్మకు టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది. నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబసభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వెల్లడించారు.
Tirumala | తిరుమల శ్రీవారి దర్శనం కోసం కాలినడకన వచ్చిన 116 ఏళ్ల వృద్ధురాలు నవనీతమ్మకు టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది. నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబసభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వెల్లడించారు.
వందేళ్లు దాటిన వృద్ధురాలు శనివారం నాడు అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను కొంతమంది సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఆ వృద్ధురాలిది కర్ణాటక అని మొదట ప్రచారం జరిగింది. ఇది చూసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వృద్ధురాలి వివరాలు తెలిస్తే టీటీడీ ఆఫీసులో సంప్రదించాలని ఎక్స్‌లో పోస్టు కోరారు. ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఆమె వివరాలను సేకరించారు. వృద్ధురాలిని తమిళనాడుకు చెందిన నవనీతమ్మగా గుర్తించి, టీటీడీ చైర్మన్‌కు సమాచారం అందించారు.
ఈ రోజు 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు శ్రీమతి నవనీతమ్మ గారికి, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ప్రత్యేక విఐపీ బ్రేక్ దర్శనం విజయవంతంగా కల్పించాము.
అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు వేదపండితులతో వేదాశీర్వచనం చేయించి, పట్టువస్త్రం కప్పి, తీర్థప్రసాదాలు… pic.twitter.com/3Cbu2loCVX
— B R Naidu (@BollineniRNaidu) July 6, 2026
వృద్ధురాలి వివరాలను తెలుసుకున్న బీఆర్ నాయుడు ఆమెతో పాటు కుటుంబసభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం టీటీడీ అధికారులు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర వేదపండితులతో వేదాశీర్వచనం చేయించి, పట్టువస్త్రం కప్పి, తీర్థప్రసాదాలు అందజేశారు. నవనీతమ్మకు నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.
దీనిపై బీఆర్ నాయుడు మరోసారి స్పందిస్తూ.. నవనీతమ్మను గుర్తించడంలో తమవంతు సహకారం అందించిన సోషల్‌మీడియా మిత్రులందరికీ, అలాగే టీటీడీ విజిలెన్స్ అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఒక భక్తురాలి జీవితకాల కోరిక నెరవేర్చిన ఈ సందర్భంగా తమ అందరికీ ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించిందని పేర్కొన్నారు.
116 ఏళ్ల వయస్సులోనూ శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆ వృద్ధ భక్తురాలి అచంచల భక్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.
ఆ భక్తురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించాలని నిర్ణయించుకున్నాను.
ఆమె గురించి ఎవరికైనా వివరాలు తెలిసి… pic.twitter.com/Tlt2qwJdKT
— B R Naidu (@BollineniRNaidu) July 5, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- AP News
- Navaneethamma
- Tirumala
- TTD
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

