TSRTC | గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్టీసీ ఎండీ.. 2,375 బస్సులు అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటన..!
TSRTC | తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్‌న్యూస్ చెప్పారు. ఆర్టీసీలో విడుతల వారీగా 2,375 బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కేంద్ర కార్యాలయం బస్ భవన్లో శుక్రవారం గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు.
TSRTC | తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్‌న్యూస్ చెప్పారు. ఆర్టీసీలో విడుతల వారీగా 2,375 బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కేంద్ర కార్యాలయం బస్ భవన్లో శుక్రవారం గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. టీఎస్ఆర్టీసీని ఆదరిస్తోన్న ప్రజలకు, సంస్థ అభివృద్దికి నిరంతరం పాటుపడుతున్న సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా భారత దేశానికి వచ్చిందని, ప్రతి పౌరుడు దేశ పురోభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. శుభదినం రోజున భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహానీయుడిని స్మరించుకోవాలన్నారు. నేటి తరంలో దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రతి రోజు ఉదయం 11 గంటలకు బస్ భవన్లో జాతీయ గీతలాపన చేస్తున్నామని చెప్పారు. దేశానికే ఆదర్శంగా నిలిచే ఈ మహోత్తర కార్యక్రమాన్ని జోన్, ఆర్ఎం కార్యాలయాలతో పాటు డిపోలకు విస్తరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు.
మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 48 గంటల్లో సమర్థవంతంగా సంస్థ అమలు చేసిందని గుర్తు చేశారు. సంస్థకు చెందిన 7200 పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రస్తుతం మహాలక్ష్మి స్కీం విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పడానికి తనకెంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు. డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు 11 కోట్ల మందికి పైగా మహిళా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామని, ఈ స్కీమ్స్‌ను ప్రతిరోజు సగటున 27 లక్షల మంది మహిళలు వినియోగించుకుంటున్నారని తెలిపారు. టీఎస్ఆర్టీసీ అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధి, నిబద్ధతతో పనిచేస్తుండడంతో ఇది సాధ్యమైతుందన్నారు.
మహాలక్ష్మి స్కీమ్‌ను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా అమలుచేస్తున్నారని సంస్థ అధికారులను, సిబ్బందిని ప్రభుత్వం మెచ్చుకుందని పేర్కొన్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందన్నారు. ఇప్పటికే 1325 డీజిల్, మరో 1,050 ఎలక్ట్రిక్ బస్సులు వాడకంలోకి తెస్తుందన్నారు. ఈ 2375 బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయి. వీటికి తోడు మరిన్ని కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు సంస్థ ప్లాన్ చేస్తుందన్నారు.
కొత్త బస్సుల్లో విధులు నిర్వర్తించేందుకు ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్‌ను చేపడుతామన్నారు. కారుణ్య నియామకాల కింద 813 మంది కండక్టర్ల నియామక ప్రక్రియను ప్రారంభిస్తామని, కరీంనగర్లో అపాయిట్మెంట్ లెటర్లను మంత్రి అందజేస్తారన్నారు. 80 మంది ఆర్టీసీ కానిస్టేబుళ్ల ట్రైనింగ్ ప్రస్తుతం కొనసాగుతోందన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో వారంతా విధుల్లో చేరుతారన్నారు.
టీఎస్ఆర్టీసీ సిబ్బంది పెండింగ్ అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి యాజమాన్యం తీసుకెళ్లిందని చెప్పారు. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని వివరించారు. సంక్రాంతికి సిబ్బంది ఎంతో కష్టపడి పనిచేశారని, అదే స్ఫూర్తి, ఉత్సాహంతో రాబోయే మేడారం జాతరకు పనిచేయాలన్నారు. ఈ గణంతంత్ర వేడుకల్లో విధుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగ అధికారులకు మెడల్స్‌తో, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరాల్లో అత్యధిక యూనిట్లు సేకరించిన హకీంపేట, చెంగిచర్ల, కంటోన్మెంట్ డిపో మేనేజర్లకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

