హైదరాబాద్, మే 9(నమస్తే తెలంగాణ): మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలో అకౌంట్స్ ఆఫీసర్స్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్, వైద్యారోగ్య శాఖలోని ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వైద్య పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ జారీ చేశారు.
వైద్య పరీక్షలకు పిలిచిన అభ్యర్థులు తప్పకుండా షెడ్యూల్ ప్రకారం హాజరు కావా ల్సి ఉంటుందని టీఎస్పీఎస్సీ తెలిపింది.