TSPSC | టీఎస్పీఎస్సీ స్టాఫ్ మరో ఉద్యోగానికి అనర్హులే.. కమిషన్‌లో కసరత్తులు
TSPSC | సరికొత్త సంస్కరణలకు టీఎస్పీఎస్సీ శ్రీకారం చుట్టబోతున్నది. కార్యాలయంలో ఉద్యోగుల నియామానికి కఠిన నిబంధనలు తీసుకురావాలని కమిషన్ భావిస్తున్నది. టీఎస్పీఎస్సీలో చేరాలంటే భవిష్యత్తులో కమిషన్ నిర్వహించే ఎటువంటి పరీక్షలు రాయడానికి అవకాశం లేకుండా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నది.
TSPSC | హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): సరికొత్త సంస్కరణలకు టీఎస్పీఎస్సీ శ్రీకారం చుట్టబోతున్నది. కార్యాలయంలో ఉద్యోగుల నియామానికి కఠిన నిబంధనలు తీసుకురావాలని కమిషన్ భావిస్తున్నది. టీఎస్పీఎస్సీలో చేరాలంటే భవిష్యత్తులో కమిషన్ నిర్వహించే ఎటువంటి పరీక్షలు రాయడానికి అవకాశం లేకుండా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నది. పేపర్ లీకేజీ ఘటనలో ఇంటి దొంగలదే కీలక పాత్రని తేలడంతో కమిషన్‌లో ఉద్యోగుల భర్తీ ప్రక్రియలో కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది. టీఎస్పీఎస్సీ కాకుండా వేరే నియామక సంస్థల నోటిఫికేషన్ల ఉద్యోగానికైతే పోటీ పడవచ్చు. కమిషన్‌లో ఉద్యోగుల ఎంపికకు కనీస అర్హతల విషయంలో మార్పులు చేయాలని భావిస్తున్నది.
ఎంపికైన అభ్యర్థి సమగ్ర సమాచారం సేకరించాలని, గతంలో ఏం చేశాడు? ఎక్కడ ఉద్యోగం చేశాడు? అక్కడ అతని ప్రవర్తన ఎలా ఉన్నది.. ఇలా ఎంపిక దశలోనే కఠినంగా వ్యవహరించాలని కమిషన్ భావిస్తున్నది. మూడురోజులుగా ప్రతిరోజూ కమిషన్ భేటీ అవుతున్నది. టీఎస్పీఎస్సీ ఏర్పడి తొమ్మిదేండ్లు అవుతుండగా, తొలిసారిగా లీకేజీ ఘటన చోటుచేసుకున్న నేపథ్యంలో ఇకపై జరుగకుండా కఠిన నిర్ణయాలపై కసరత్తు చేస్తున్నది. పేపర్ లీకేజీలో కీలక నిందితుడైన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్‌రెడ్డిని ఉద్యోగంలో నుంచి తొలగించింది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్‌ను సస్పెండ్ చేసింది. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో అంతర్గత బదిలీలు చేసింది. కీలక బాధ్యతల్లో ఉండే అభ్యర్థులపై నిఘాను మరింత పెంచింది.
ఎన్వోసీ, అండర్ టేకింగ్ తప్పనిసరి..
టీఎస్పీఎస్సీలో ఇప్పటికే ఉద్యోగంలో చేరిన వ్యక్తులు భవిష్యత్తులో కమిషన్ ఉద్యోగాలకు పరీక్ష రాయాలంటే ఏం చేయాలి? అనే అంశంపై అధ్యయనం చేస్తున్నది. ఇప్పటికే ఉద్యోగులైతే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ సమయంలోనే కమిషన్‌కు సమాచారం ఇవ్వాలని, పరీక్ష తేదీకి మూడునెలల ముందు నుంచి ఫలితాలు వెలువడిన నెలరోజుల తర్వాత వరకు సెలవులో వెళ్లేలా నిబంధన తీసుకురావాలని కమిషన్ భావిస్తున్నది. ఈ సమయంలో కమిషన్ నుం చి నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలని, సెలవులో వెళ్లేటప్పు డు అండర్ టేకింగ్ ఇచ్చి వె ళ్లాలని, ప్రిపరేషన్ సమయం లో బయటి వ్యక్తులను ఎవరినీ కలవను అని అఫిడవిట్ వంటిది తీసుకోవాలని కమిషన్ భావిస్తున్నది. టీఎస్పీఎస్సీలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగానికి పరీక్ష రాయాలనుకుంటే.. కమిషన్ నుంచి రిమూవ్ చేయాలని ఆలోచిస్తున్నది. ఇలాంటి కఠిన నిర్ణయాలతో టీఎస్పీఎస్సీలో నిబంధనలు మరింత పటిష్టం చేయాలని భావిస్తున్నది.
కమిషన్ భేటీలో కీలకంగా చర్చించిన విషయాలు
- టీఎస్పీఎస్సీలో పనిచేసే ఉద్యోగుల ఎంపిక విధానంలోనూ కీలక మార్పులు చేయాలి.
- జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపిక చేయాలన్నా రెండు దశల్లో ఎంపిక విధానం ఉండాలి.
- లా, ఐటీ వంటి వాటిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ను అర్హతగా తీసుకురావాలి.
- ఒకసారి కమిషన్‌లో ఉద్యోగంలో చేరితే, టీఎస్పీఎస్సీ భర్తీ చేసే ఏ ఉద్యోగ పరీక్ష రాయడానికి అవకాశం లేదు.
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు టీఎస్పీఎస్సీలో పనిచేస్తూ కమిషన్ భర్తీ చేసే ఉద్యోగ పరీక్ష రాయాలి అనుకుంటే.. ఉద్యోగం నుంచి తొలగిస్తారు.
- కమిషన్‌లో ఉద్యోగులైతే నోటిఫికేషన్ స మయంలోనే కమిషన్‌కు సమాచారం ఇవ్వాలి. పరీక్ష తేదీకి మూడు నెలల ముం దు నుంచే సెలవులో వెళ్లాలి. ఫలితాలు వ చ్చిన నెలరోజుల తర్వాత విధుల్లో చేరాలి.
- ఉద్యోగానికి దరఖాస్తు చేసి.. సెలవులో వెళ్లేటప్పుడు తప్పనిసరిగా అండర్ టేకింగ్ ఇవ్వాలి. ప్రిపరేషన్ సమయంలో బయటి వ్యక్తులను ఎవరినీ కలవను అని అఫిడవిట్ సమర్పించాలి.
- టీఎస్పీఎస్సీలో విజిటర్స్‌కు అనుమతి లేదు. ఉద్యోగులను ఎవరూ ఆఫీసుకు వచ్చి కలవడానికి అవకాశం లేదు. ఎవరైనా దరఖాస్తు చేయడానికి వస్తే హెల్ప్‌డెస్క్‌లో వినతిపత్రం ఇచ్చి వెంటనే వెళ్లిపోవాలి. అప్లికేషన్‌ను పరిశీలించి కమిషన్ తగు సమాధానం ఇస్తుంది.
- అధికారికంగా ఎవరైనా కమిషన్‌లో సంప్రదించాలి అంటే సెక్రటరీ లేదా చైర్మన్ అనుమతి తప్పనిసరి. అప్పుడు కూడా సెక్యూరిటీ దగ్గర ఉండి అనుమతి తీసుకున్న అధికారి దగ్గరికి పంపుతారు. మళ్లీ.. దగ్గర ఉండి బయటికి తీసుకెళతాడు. మిగిలిన ఎవరినీ కలవడానికి అవకాశం ఉండదు.
- టీఎస్పీఎస్సీలో పనిచేసే ఉద్యోగులు ఎవరి సెక్షన్లో వాళ్లు మాత్రమే ఉండాలి. మరో సెక్షన్లోకి వెళ్లడానికి అనుమతి లేదు.
- ప్రస్తుతం 25 వేలలోపు దరఖాస్తులు వచ్చిన ఉద్యోగాలకే ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో ఆ సంఖ్యను పెంచాలని, అవకాశం ఉన్నన్ని ఎక్కువ పరీక్షలు ఆన్లైన్ పద్ధతిలోనే నిర్వహించాలి.
- ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడితే పదేండ్ల కఠిన శిక్ష. భవిష్యత్తులో మరో పోటీ పరీక్ష రాయడానికి అనర్హుడిగా ప్రకటించడం. భారీగా జరిమానా. ఆస్తుల జప్తు. ప్రశ్నపత్రాల లీకేజీకి ప్రయత్నించినా కఠినంగానే వ్యవహరించాలి.
- కారుణ్య నియామకాల ద్వారా టీఎస్‌పీఎస్సీలోకి ఉద్యోగుల చేరికను నియంత్రించాలి. ఒకవేళ ఎవరైనా అలా వస్తే.. స్క్రీనింగ్ కమిటీ ద్వారా ఎంపికలు జరగాలి.
- లా, ఐటీ, సోషల్ సైన్సెస్ తదితర సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారినే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ స్థాయిలో నియమించాలి. తొలుత స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాలి. 1:5 లేదా 1:10 రేషియోలో ఎంపిక చేసి మెయిన్స్‌కు పంపాలి. ఇలా రెండు దశల్లో ఉద్యోగుల ఎంపిక ఉండాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

