హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC).. డైరెక్టరేట్ ఆఫ్ హార్టికల్చర్ పరిధిలోని హార్టికల్చర్ ఆఫీసర్ (Horticulture Officer) పోస్టుల నియామక పరీక్షలను వాయిదా వేసింది. ఈ మేరకు TSPSC ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే నెల 4న జరగాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్ నియామక పరీక్షను.. జూన్ 17వ తేదీకి రీ షెడ్యూల్ చేసినట్లు TSPSC ఆ ప్రకటనలో తెలిపింది.
జూన్ 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్ష ఉంటుందని వెల్లడించింది. 22 మంది హార్టికల్చర్ ఆఫీసర్ల నియామకం కోసం టీఎస్పీఎస్సీ 2022 డిసెంబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023 జనవరి 3 నుంచి జనవరి 24 వరకు దరఖాస్తులు స్వీకరించారు.