Group-1 Prelims | గ్రూప్-1లో 8 ప్రశ్నలు పూర్తిగా తొలగింపు.. 2 ప్రశ్నలకు ఆప్షన్స్ మార్పు
Group-1 Prelims | గ్రూప్-1 తుది కీని టీఎస్పీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. వెబ్సైట్లో పొందుపరిచింది. నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో సమవేశమైన కమిషన్.. గ్రూప్-1కీ పై చర్చించి ఫైనల్ కీని ఖరారుచేసి విడుదల చేసింది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో సరైన సమాధానాలు లేని కారణంగా ఎనిమిది ప్రశ్నలను తొలగించింది.
Group-1 Prelims | హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 తుది కీని టీఎస్పీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. వెబ్సైట్లో పొందుపరిచింది. నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో సమవేశమైన కమిషన్.. గ్రూప్-1కీ పై చర్చించి ఫైనల్ కీని ఖరారుచేసి విడుదల చేసింది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో సరైన సమాధానాలు లేని కారణంగా ఎనిమిది ప్రశ్నలను తొలగించింది. మరో రెండు ప్రశ్నలకు ప్రాథమిక కీలో ఇచ్చిన ఆప్షన్లను మార్చింది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలు, నిపుణుల కమిటీ సూచనల మేరకు టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకున్నది. గ్రూప్-1ను 150 మార్కులకు నిర్వహించగా, తాజాగా 8 ప్రశ్నలను తొలగించడంలో 142 ప్రశ్నలనే పరిగణనలోకి తీసుకుంటారు. మార్కులను మాత్రం 150 మార్కులకే లెక్కిస్తారు. ఈ ప్రక్రియలో ఒక్కో సరైన సమాధానానికి 1.05 మార్కులను కేటాయించే అవకాశాలున్నాయి.
2.33 లక్షల అభ్యర్థులు
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 11న నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరైన 2,33,506 అభ్యర్థులకు చెందిన డిజిటల్ ఓఎమ్మార్ షీట్లను, మాస్టర్ ప్రశ్నపత్రం, ప్రాథమిక కీని టీఎస్పీఎస్సీ జూన్ 28న విడుదల చేసింది. ఈ ప్రాథమిక కీపై జూలై 1 నుంచి 5 వరకు అభ్యంతరాలను స్వీకరించింది. ఈ అభ్యంతరాలను పరిశీలించిన నిపుణుల కమిటీ పలు ప్రతిపాదనలను కమిషన్ ముందు ఉంచింది. ఈ ప్రతిపాదనలను ఆమోదించిన కమిషన్ మంగళవారం తుది కీని వెబ్సైట్లో పొందుపరిచింది. ఈ నేపథ్యంలో ఈ నెలలోనే గ్రూప్-1 ఫలితాలు విడుదల కానున్నాయి.
కీ లో సవరణలు ఇలా..
- సరైన సమాధానాలు లేని కారణంగా 3, 4, 5, 46, 54, 114, 128, 135 నంబర్ గల ప్రశ్నలను తొలగించారు.
- ప్రశ్న నంబర్ 38కు ప్రాథమిక కీలో 3 ఆప్షన్‌ను సరైనదిగా ప్రకటించగా, తాజాగా ఆప్షన్ 2కు మార్చారు.
- ప్రశ్నసంఖ్య 59కు ప్రాథమిక కీలో ఆప్షన్ 1 సరైనదిగా ఇవ్వగా, తాజాగా ఆప్షన్ 3 సరైన సమాధానంగా ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

