TSPSC | ప్రశ్నాపత్రం లీకేజీ కేసు.. ఇద్దరు ఉద్యోగులను తొలగించిన టీఎస్పీఎస్సీ!
TSPSC | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఇద్దరు ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగిస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకున్నది.
TSPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నిర్వహిస్తున్న పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీకి కారణమైన ఇద్దరు ఉద్యోగులను తొలగిస్తూ టీఎస్పీఎస్సీ మంగళవారం నిర్ణయం తీసుకున్నది. వారిలో టీఎస్పీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, మరో ఉద్యోగి రాజశేఖర్ ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. టీఎస్పీఎస్సీ ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. అసిస్టెంట్ ఇంజినీరింగ్ పరీక్ష కూడా లీకైందని గుర్తించామని, దాంతో పాటు గతంలో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను ఏమైనా లీక్ చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాస్తవానికి మొదట టీఎస్పీఎస్సీ సర్వర్ హ్యాకింగ్‌కు గురై ప్రశ్నపత్రాలు లీకైనట్లు అధికారులు భావించారు. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్, ఔట్ సోర్సింగ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్‌రెడ్డి ప్రశ్నాపత్రాలను దొంగిలించారని గుర్తించారు. రేణుక, ఆమె భర్త ఢాక్యా నాయక్‌లతో కుదిరిన ఒప్పందం మేరకు ప్రశ్నపత్రాలను దొంగిలించారని, వీరి నుంచి నలుగురు వ్యక్తులు వాటిని కొనుగోలు చేసినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. ఇందులో వ్యవహారంలో తొమ్మిది మందిని అరెస్టు చేశామని, రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.
More Read
టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ల లీకేజీలో తొమ్మిది మంది అరెస్ట్.. కీలక విషయాలను వెల్లడించిన పోలీసులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maya Lady | ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా ‘మాయ లేడీ’ ట్రైలర్!
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

