TS -bPASS | టీఎస్బీపాస్కు దేశం ఫిదా.. సింగిల్ విండో విధానంపై ఆసక్తి చూపుతున్న తమిళనాడు, పంజాబ్
తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్‌బీపాస్) ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. సులువుగా ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ఈ విధానాన్ని అమలు చేయడానికి ఇతర రాష్ర్టాలు ఆసక్తి చూపిస్తున్నాయి.
- అధ్యయనానికి పలు రాష్ట్రాల ఆసక్తి
- ఆన్లైన్లో ఇండ్ల నిర్మాణ అనుమతులిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ
- సంస్కరణలతో మెరుగైన ప్రజాసేవలు
- ఇప్పటివరకు 2.45 లక్షలు దరఖాస్తులు
TS -bPASS | హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్‌బీపాస్) ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. సులువుగా ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ఈ విధానాన్ని అమలు చేయడానికి ఇతర రాష్ర్టాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రతి పట్టణంలో ఇండ్ల నిర్మాణాలకు ఆన్లైన్లో అనుమతులు ఇస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. ఈ విధానం విజయవంతం కావడంతో పంజాబ్, తమిళనాడు తదితర రాష్ర్టాలు అమలు చేయడానికి ముందుకొచ్చాయి. దీని గురించి తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. ఈవిధంగా కూడా అనుమతులు ఇవ్వవచ్చా! అంటూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్ కూడా అధికారులతో స్వయంగా వచ్చి అధ్యయనం చేశారు. టీఎస్‌బీపాస్ ప్రజలకు మరింత మెరుగ్గా ఉండే విధంగా రాష్ట్ర అధికారులు మార్పులు చేస్తున్నారు. దీనిని రిజిష్ట్రేషన్ కార్యాలయాలతో అనుసంధానం చేసే ప్రక్రియ నడుస్తున్నది.
ఒకసారి ఈ ప్రక్రియ పూర్తి అయితే ఇక అక్కడి నుంచే భూ వివరాలు లభిస్తాయి. ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించడం, తిరస్కరించిన దరఖాస్తుదారుల డబ్బులు వెంటనే వారి ఖాతాల్లో జమచేయడం, వారి సందేహాలు తీర్చడానికి ప్రత్యేకంగా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)ను ఏర్పాటుచేశారు. దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా చూసేందుకు ఉన్నతాధికారులు వారానికి ఒకసారి సమీక్షిస్తున్నారు. విచారణ నివేదికలు అందజేయడంలో జాప్యం చేస్తున్న వారి వేతనాల్లో కోత విధిస్తున్నారు. 200 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు అక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ)ను టీఎస్‌బీపాస్ ద్వారానే అందిస్తున్నారు. కూల్ రూఫ్ పాలసీని పకడ్బందీగా అమలు చేయడానికి టీఎస్‌బీపాస్ విధానంలో చేర్చారు. ఓసీ ఇచ్చే సమయంలో వారి ఇండ్లకు కూల్ రూఫ్ పాలసీని అమలు చేశారా? లేదా? అనేది పరిశీలించనున్నారు. కేంద్రీకృత విధానంలో అమలు చేస్తున్న టీఎస్‌బీపాస్ ద్వారా ప్రభుత్వ నిబంధనలు అన్నీ అమలు చేయనున్నారు.
2.45 లక్షల దరఖాస్తులు
టీఎస్‌బీపాస్ 2020 నవంబర్ 16 ప్రారంభమైంది. ఇప్పటివరకు మొత్తం 2.45 లక్షల దరఖాస్తులు రాగా వీటిలో ఇన్స్టాంట్ రిజిస్ట్రేషన్ కింద 22,643 దరఖాస్తులు, ఇన్స్టాంట్ అప్రూవల్‌లో భాగంగా 2,02,512, సింగిల్ విండో విధానంలో 17,829 వచ్చాయి. సింగిల్ విండో విధానంలో 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ స్థలంలో, 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో నిర్మాణాలు చేపడుతున్న వారికి అనుమతులు ఇస్తున్నారు. వాణిజ్య భవనాలు, హైరైజ్ భవనాలు, గ్రూపు హౌసింగ్, అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు, మల్టీ ఫ్లెక్స్‌లు, నాన్ రెసిడెన్షియల్ భవనాలకు ఈ విభాగంలో అనుమతులు ఇస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
Agriculture university | వీసీ అల్డాస్ జానయ్యపై నో యాక్షన్.. ప్రభుత్వం దేని కోసం ఉన్నదంటూ నిరసనలు.. వీడియో
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

