TS Weather Update | ఈ జిల్లాల్లో భారీగా పొగమంచు..! ఎల్లో అలెర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ..!
TS Weather Update | తెలంగాణలో చలి కొనసాగుతున్నది. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఉత్తర భారం నుంచి తెలంగాణ మీదుగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
TS Weather Update | తెలంగాణలో చలి కొనసాగుతున్నది. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఉత్తర భారం నుంచి తెలంగాణ మీదుగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరో వైపు రాష్ట్రంలో రాగల రెండురోజులు పొడి వాతావరణ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 10న ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉదయం పొగమంచు పేరుకుపో అవకాశం ఉంటుందని పేర్కొంది.
అలాగే, ఈ నెల 11న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జనగాం, సిద్దిపేట, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళ్లల్లో పొగమంచు ఆవరిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని.. ఉదయం వేళల్లో పొగమంచు కమ్మేస్తుందని పేర్కొంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19 డిగ్రీలు ఉండే అవకాశం ఉందని వివరించింది. ఉపరితల గాలులు ఆగ్నేయ దిశల నుంచి గంటకు ఆరు నుంచి పది కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలున్నాయిన చెప్పింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

