TS Weather | తెలంగాణ జిల్లాల్లో రెండురోజులు వడగాలులు.. హెచ్చరించిన వాతావరణశాఖ
TS Weather | తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మార్చిలోనే ఎండలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా మూడు డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి.
TS Weather | తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మార్చిలోనే ఎండలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా మూడు డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఉదయం నుంచే మాడుపగిలేలా ఎండలు దంచికొడుతుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇక రాగల మూడురోజుల పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, జిల్లాల్లో రాత్రిళ్లు వేడిగా ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ ఒకటిన ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని హెచ్చరించింది.
పలు జిల్లాల్లో రాత్రిళ్లు ఉష్ణోగ్రతలు ఉండడంతో వేడిగా ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 2న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి, నారాయణపేట, జోగులాంబ గద్వాలలో అక్కడక్కడ వేడిగాలులు వీచే అవకాశం ఉంటుందని తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

