TS TET | ఇష్టానుసారం టెట్ పరీక్షా కేంద్రాల కేటాయింపు.. మండిపడుతున్న అభ్యర్థులు
TS TET | టీఎస్ టెట్-2024 హాల్ టికెట్లు నిన్న సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తులో ఇచ్చిన ప్రాధాన్యత క్రమంలో కాకుండా.. ఇష్టానుసారం టెట్ పరీక్షా కేంద్రాలను కేటాయించడంతో అభ్యర్థులు మండిపడుతున్నారు.
TS TET | హైదరాబాద్ : టీఎస్ టెట్-2024 హాల్ టికెట్లు నిన్న సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తులో ఇచ్చిన ప్రాధాన్యత క్రమంలో కాకుండా.. ఇష్టానుసారం టెట్ పరీక్షా కేంద్రాలను కేటాయించడంతో అభ్యర్థులు మండిపడుతున్నారు. సొంత జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించాలని ఆప్షన్ పెట్టుకున్నప్పటికీ అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోలేదు.
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థులకు సిద్దిపేట, హైదరాబాద్‌లో, కరీంనగర్ జిల్లా అభ్యర్థులకు వరంగల్, హైదరాబాద్‌లో, ఖమ్మం జిల్లా అభ్యర్థులకు సిద్దిపేటలో.. ఇలా ఇష్టానుసారంగా పరీక్షా కేంద్రాలను అధికారులు కేటాయించారు. ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నామంటూ.. సొంత జిల్లాలకు చాలా దూరంగా పరీక్ష కేంద్రాలు కేటాయించడం ద్వారా అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెట్ పరీక్ష ఫీజు రూ. 1000 తీసుకొని మళ్ళీ ఇప్పుడు పరీక్ష కేంద్రాలు వేరే జిల్లాల్లో ఇవ్వడం సరికాదని బీఎడ్, డీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇక టెట్ పరీక్షలు ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు రెండు విడతల్లో నిర్వహించనున్నారు. తొలిసారిగా ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ పద్ధతి(సీబీటీ)లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది టెట్ పరీక్షకు 2.86లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 48,582 మంది సర్వీస్ టీచర్లు కూడా దరఖాస్తులు సమర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

