TS TET | బుధవారంతో ముగియనున్న టెట్ దరఖాస్తుల గడువు
TS TET | తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ దరఖాస్తు గడువు బుధవారంతో ముగియనున్నది. ఇప్పటి వరకు 2,50,963 దరఖాస్తులు వచ్చాయి. టెట్ పేపర్-1కు 74,026 మంది అభ్యర్థుల దరఖాస్తు చేశారు. టెట్ పేపర్-2కు 16,006 మంది అభ్యర్థులు, రెండు పేపర్లు రాసేందుకు 1,60,931 దరఖాస్తులు దరఖాస్తు చేసుకున్నారు.
TS TET | తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ దరఖాస్తు గడువు బుధవారంతో ముగియనున్నది. ఇప్పటి వరకు 2,50,963 దరఖాస్తులు వచ్చాయి. టెట్ పేపర్-1కు 74,026 మంది అభ్యర్థుల దరఖాస్తు చేశారు. టెట్ పేపర్-2కు 16,006 మంది అభ్యర్థులు, రెండు పేపర్లు రాసేందుకు 1,60,931 దరఖాస్తులు దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 1న టెట్ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. 2వ తేదీ నుంచి తెలంగాణ విద్యాశాఖ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇక సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి. పేపర్-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించింది.
బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్-2తోపాటు పేపర్-1 పరీక్ష కూడా రాసుకునేందుకు అవకాశం ఉన్నది. అయితే, అంచనా మేరకు రాష్టంలో 1.5 లక్షల డీఎడ్, 4.5 లక్షల మంది బీఎడ్ అభ్యర్థులున్నారు. 2017 టీఆర్టీ నోటిఫికేషన్ ద్వారా 8,792 టీచర్ పోస్టులను భర్తీచేశారు. గతంలో టెట్‌కు 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉండగా, రెండేండ్ల క్రితం టెట్ వ్యవధిని జీవితకాలం పొడిగించారు. గతంలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు పోటీపడే అవకాశం డీఎడ్ వారికే ఇవ్వగా.. కొత్తగా బీఈడీ అభ్యర్థులకు అవకాశం కల్పించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2లక్షల మంది టెట్ క్వాలిఫై కానివారున్నారు. వీరే కాకుండా కొత్తగా బీఈడీ, డీఎడ్ పూర్తిచేసిన వారు మరో 20వేల వరకు ఉండనున్నారు. తాజా టెట్ నిర్వహణతో వీరందరికి మరోమారు పోటీపడే అవకాశం దక్కనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

