TS RTC | ఆర్టీసీ ప్రయాణికులకు తీపి కబురు.. సిటీలో రూ. 90కే 24 గంటల ఫ్రీ జర్నీ
TS RTC | టీఎస్ ఆర్టీసీ(TS RTC) సంస్థ ప్రయాణికులకు మరో తీపి కబురును అందించింది. గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) పరిధిలో 24 గంటల పాటు ప్రయాణించే వారికి వెసులుబాటును కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీ(TS RTC) సంస్థ ప్రయాణికులకు మరో తీపి కబురును అందించింది. గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) పరిధిలో 24 గంటల పాటు ప్రయాణించే వారికి వెసులుబాటును కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రయాణికుల టీ-24 టికెట్ ధరను రూ.100 నుంచి రూ.90కి తగ్గించింది. కొత్తగా సీనియర్ సిటిజన్లకు(Senior Citizens) టీ-24 టికెట్లో రాయితీ కల్పించాలని నిర్ణయించింది. వారికి రూ.80కే ఆ టికెట్‌ను అందించనుంది.60 ఏళ్లు పైబడిన వారికే టీ-24 టికెట్లో 20 శాతం రాయితీ వర్తిస్తుంది.
టికెట్ తీసుకునే సమయంలో వయసు ధ్రువీకరణ కోసం సీనియర్ సిటిజన్లు తమ ఆధార్ కార్డ్(Aadhar Card)ను బస్ కండక్టర్లకు విధిగా చూపించాల్సి ఉంటుందని, సవరించిన ధరలు రేపటి(గురువారం) నుంచే అమలులోకి వస్తాయని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్దన్(Chairman Goverdan), సంస్థ ఎండీ వీసీ సజ్జనార్(VC Sajjanar) ప్రకటించారు.
హైదరాబాద్‌లో ఎక్కువగా ప్రయాణించే వారి కోసం గతంలో టీ-24 టికెట్‌ను సంస్థ అందుబాటులోకి తీసుకురాగా ఆ టికెట్‌ను కొనుగోలు చేసే ప్రయాణికులు సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 24 గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. మొదట ఆ టికెట్ ధరను రూ.120గా నిర్ణయించి అమలు చేయగా ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు ఆ తర్వాత టీ-24ని 100కి తగ్గించింది. తాజాగా సాధారణ ప్రయాణికులకు టీ-24 టికెట్ ధరను రూ.90కి, సీనియర్ సిటిజన్లకు రూ.80కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
టీ-24 టికెట్‌కు మంచి స్పందన వస్తోందని, ప్రతి రోజు సగటున 25 వేల వరకు టికెట్లు అమ్ముడు పోతున్నాయని వారు తెలిపారు. నగరం పరిధిలో తిరిగే ఆర్డినరీ, మెట్రో బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్ అందుబాటులో ఉంటుందని, ప్రయాణికులందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలు, సీనియర్ సిటీజన్ల కోసం టీ-6 టికెట్‌ను ఇటీవల ప్రారంభించామని, రూ.50కి ఆ టికెట్‌ను కొనుగోలు చేస్తే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణించవచ్చని చెప్పారు.
అలాగే, కుటుంబ సభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ఎఫ్-24 టికెట్‌ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. రూ.300 చెల్లించి నలుగురు 24 గంటల పాటు ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో తీసుకువచ్చిన టీ-24, టీ-6, ఎఫ్-24 టికెట్లను కొనుగోలు చేసి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

