హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకా ముందు ఆలోచించకుండా ఆదరబాదరగా ప్రవేశపెట్టిన మహిళలకు(Mahalaxmi scheme) ఉచిత బస్ ప్రయాణం(Free bus travel) ఆర్టీసీ పుట్టి ముంచుతుందా? అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. ఆర్టీసీకి(TS RTC) ఇప్పటికే రూ.1400 కోట్ల రూపాయల ఉచిత బస్ సర్వీస్ బకాయిలు ఉన్నాయి.
అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి ఉచిత సర్వీసుతో దారుణంగా మారింది. నెల నెలా ఆర్టీసీకి ఉచిత బస్ సర్వీస్ డబ్బులు ఇస్తామని మొదలు బొంకిన రేవంత్ రెడ్డి సర్కార్, ఇప్పుడు నాలుగు నెలలు కావస్తున్నా ఇవ్వలేదు. రోజువారీ ఖర్చులకు కూడా టీఎస్ ఆర్టీసీ వద్ద డబ్బు లేక సతమ తమ వుతున్నది.
పరిస్థితి ఇలాగే కొనసాగితే బస్సులకు డీజిల్, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు కూడా ఇక్కట్లు తప్పవనే వాదనలు వినిస్తున్నాయి. అనాలోచిత నిర్ణయాలతో టీఎస్ ఆర్టీసీ భవిష్యత్ గంగలో కలిసే ప్రమాదం ఉందని ఆర్టీసీ ఉద్యోగస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ సంక్షోభం నుంచి ఆర్టీసీ ఎలా బయట పడుతుందో చూడాలి.