నుమాయిష్‌తో గొప్ప అనుభూతి : మంత్రి హరీశ్‌రావు
Numaish | నాంపల్లి ఎగ్జిబిషన్ ద్వారా గొప్ప అనుభూతి పొందవచ్చని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నుమాయిష్‌ను మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం ప్రారంభించారు. 45 రోజుల
హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ ద్వారా గొప్ప అనుభూతి పొందవచ్చని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నుమాయిష్‌ను మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం ప్రారంభించారు. 45 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగునున్నది. 1938లో వంద స్టాళ్లతో ప్రారంభమైన నుమాయిష్ ప్రారంభం కాగా.. ప్రస్తుతం 1500కుపైగా స్టాల్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ నుమాయిస్ భారీగా ప్రజాదరణ పొందిందన్నారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా గొప్ప అనుభూతిని పొందవచ్చని చెప్పారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా 19 విద్యా సంస్థలు నడుస్తున్నాయని, సొసైటీ ద్వారా 10వేల మందికి లబ్ధి కలుగుతుందన్నారు.
ప్రారంభంలోనే 60శాతం స్టాల్స్ నిండిపోయాయని, అన్ని రకాల సాంస్కృతిక సంప్రదాయాలు ఇక్కడ దర్శనమిస్తాయన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఎంతో మంది వ్యాపారులు ఇక్కడకు వస్తారని, 30వేల మంది విద్యార్థులకు ఈ సొసైటీ ద్వారా విద్యనందిస్తున్నారన్నారు. మహిళల చదువుకు సొసైటీ పెద్దపీట వస్తుందన్నారు. సొసైటీలో చదివిన వారంతా ఎంతో మంది ఉన్నతస్థానాల్లో ఉన్నారని తెలిపారు. పదివేల మంది సొసైటీ ద్వారా ఉపాధి పొందుతున్నారన్నారు. ప్రస్తుతం 45 రోజుల పాటు ఎంతో మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఎగ్జిబిషన్‌కు సహకరించిన సహచర మంత్రులు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కరోనాను దృష్టిలో పెట్టుకొని హెల్త్ సెంటర్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆర్టీసీ సైతం ప్రత్యేకంగా బస్సులు నడుపుతుందని చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ 82 సంవత్సరాల నుంచి నుమాయిష్ నడుస్తుందన్నారు. నుమాయిష్‌తో వచ్చిన ఆదాయంతో పాఠశాలలు, విద్యా సంస్థలు నడుపడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్థలం విషయంలో చొరవ చూపారన్నారు. తన చిన్నతనం నుంచి ఎగ్జిబిషన్ కార్యకలాపాలను చూస్తున్నానని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంతో మందికి సొసైటీ ఉచిత విద్యను అందిస్తుందని తెలిపారు. ఎగ్జిబిషన్‌తో వచ్చిన డబ్బులను ఎడ్యూకేషన్ కోసం వెచ్చించడం అభినందనీయమని మంత్రి మహమూద్ అలీ అన్నారు. సొసైటీ పదివేల మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

