TS Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి..
TS Inter Results | హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమం నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో జరిగింది.
TS Inter Results | హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమం నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో జరిగింది. ఫలితాల కోసం ntnews.com వెబ్‌సైట్‌ను కూడా సంప్రదించవచ్చు. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు మొత్తం 9.47 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల కోసం కింది లింకులు క్లిక్ చేయండి..
ఇంటర్ ఫస్టియర్ ఫలితాల కోసం
ఇంటర్ సెకండియర్ ఫలితాల కోసం
ఫస్టియర్ 4,33,082 మంది హాజరైతే 2,72,208 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్‌లో 62.85 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్‌లో 3,80,920 మంది హాజరైతే 2,56,241 మంది ఉత్తీర్ణత సాధించగా, 67.27 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో 61.68 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా, బాలికలు 68.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 54.66 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ 2022-23 ఫలితాలను విడుదల చేశాం. మార్చి 15 నుంచి పరీక్షలు నిర్వహించాం. విద్యార్థి దశలో ఇంటర్ అనేది కీలకమైంది. జీవితానికి టర్నింగ్ పాయింట్. మన రాష్ట్రంలో ఫస్టియర్, సెకండియర్ 9,45,153 మంది హాజరయ్యారు. 1473 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించాం. 26 వేల మంది సేవలందించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన అన్ని విభాగాల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎంసెట్ విషయంలో ఇంటర్ వెయిటేజీని తీసేస్తున్నామని ప్రకటించారు. పిల్లలు ఎవరూ కూడా ఒత్తిడికి గురి కావొద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | కివీస్ జోరుకు భారత బౌలర్ల బ్రేకులు.. 20 ఓవర్లలో మూడు వికెట్లు డౌన్
Allu Sneha Reddy | అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డికి అరుదైన గౌరవం.. అభినందనల వెల్లువ!
IND vs NZ | చెలరేగిన టిమ్ సీఫెర్ట్.. తొలి 10 ఓవర్లలో కివీస్ స్కోర్ 72/0
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. రంగంలోకి పోలీసు బృందాలు!
Ranabaali | ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ‘రణబాలి’.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

