జులైలో తెలంగాణ ఇంటర్ పరీక్షలు

హైదరాబాద్ : ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్(ఐపీఈ) 2021 ను జులై రెండో వారంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డు తెలిపింది. ప్రశ్నాపత్రాలు ఇప్పటికే ప్రింట్ అయి ఉండటంతో పరీక్షా విధానంలో ఎటువంటి మార్పు లేదంది. కాగా కొవిడ్ నేపథ్యంలో మూడు గంటల పరీక్షా సమయాన్ని 90 నిమిషాలకు కుదించింది. అంతేకాకుండా ప్రశ్నాపత్రంలో 50 శాతం ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుందంది. దీన్నే వంద శాతానికి పరిగణిస్తామని విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కేంద్ర విద్యా మంత్రిత్వశాఖకు పంపిన లేఖలో పేర్కొన్నారు.
కొవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని రెండు వేర్వేరు సెట్ల ప్రశ్నపత్రాలను ఉపయోగించడం ద్వారా ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. జులై మధ్య నుండి పరీక్షలను నిర్వహించి ఆగస్టు చివరి నాటికి ఫలితాలను ప్రకటించవచ్చని తెలిపింది. కొవిడ్ లేదా ఇంకా ఏవైనా కారణాల వల్ల పరీక్షలకు హాజరు కాలేని విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
ఈ నెల 29వ తేదీ నుంచి జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్స్‌ను వాయిదా వేస్తూ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ గురువారం ప్రకటించారు. జూన్ మొదటి వారంలో పరిస్థితి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలకు నిర్వహించే 15 రోజుల ముందు షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని కోరారు. దీంతో ఈ నెల 29 నుంచి జూన్ 7వ తేదీ వరకు జరగాల్సిన ప్రాక్టికల్స్ నిలిచిపోయాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

