TS Council | ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ బాటలు : మంత్రి ఐకే రెడ్డి
మంత్రి ఐకే రెడ్డి | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సుప్రసిద్ధ ఆలయాలన్నింటికీ సీఎం కేసీఆర్ నిధులు కేటాయిస్తూ..అభివృద్ధికి బాటలు వేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సుప్రసిద్ధ ఆలయాలన్నింటికీ సీఎం కేసీఆర్ నిధులు కేటాయిస్తూ..అభివృద్ధికి బాటలు వేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.
సోమవారం మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గూడెం సత్యనారాయణ స్వామి, గంగాపూర్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులపై ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఇతర సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, ఎగ్గె మల్లేశం, ప్రభాకర్‌ర్ రావు అడిగిన అనుబంధ ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నిత్యకైంకర్యాలకు 3,645 ఆలయాల్లో అర్చకులకు ధూప దీప నైవేద్య పథకం ద్వారా గౌరవ వేతంనం, అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, కామన్ గుడ్ ఫండ్ నిధుల ద్వారా పురాతన ఆలయాల జీర్ణోధారణ, నూతన ఆలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు.
రూ. 50 కోట్లతో బాసర ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని, ప్రస్తుతం రూ. 8.40 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులతో అతిథి గృహాలు, షెడ్స్, ప్రహరీ గోడ ఇతర ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
డిసెంబర్ 2021 నాటికి ఇప్పుడు కొనసాగుతున్న అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని, మిగిలిన పనులను డిసెంబర్ 2022 నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. దక్షిణ అయోధ్య భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు రూపోందిస్తున్నారని వెల్లడించారు.
గోదావరి పుష్కరాల సమయంలో రూ. 30 లక్షలతో గూడెం సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో షెడ్స్, రోడ్ల నిర్మాణాలు, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. రూ. 26 లక్షలతో ఇతర అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
రూ. 50 లక్షల అంచనా వ్యయంతో గంగాపూర్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో మండపం, విమాన గోపుర నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
ఇవి కూడా చదవండి..
Esha Gupta | ఇషా గుప్తా బికినీ సెగలు
తనను నిర్బంధించిన గదిని ఊడ్చిన ప్రియాంకా గాంధీ.. వీడియో వైరల్
Pandora Papers | ఏంటీ పండోరా పేపర్స్.. సచిన్ విదేశీ ఆస్తులపై ఏం చెప్పింది?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

