Congress-BJP | దీపాదాస్‌కు బెంజ్ గిఫ్ట్.. కాంగ్రెస్-బీజేపీ మధ్య ‘కానుక’ కయ్యం!
రాష్ట్రంలో కాంగ్రెస్- బీజేపీకి మధ్య ‘కారు చిచ్చు’ రాజుకున్నది. ఎంపీ టికెట్ ఆశావహుల్లో ఒకరు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీకి ‘బెంజ్ కారు’ బహుకరించినట్టు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన ఆరోపణ ఇరు పార్టీల మధ్య మంటలు రాజేసింది.
- ఎంపీ టికెట్ కోసమే కారు ఇచ్చారు
- బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపణ
- పరువు నష్టం దావా వేస్తా: రేణుకా చౌదరి
- సాక్ష్యాధారాలు ఉన్నాయి: ప్రభాకర్
Congress-BJP | హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్- బీజేపీకి మధ్య ‘కారు చిచ్చు’ రాజుకున్నది. ఎంపీ టికెట్ ఆశావహుల్లో ఒకరు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీకి ‘బెంజ్ కారు’ బహుకరించినట్టు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన ఆరోపణ ఇరు పార్టీల మధ్య మంటలు రాజేసింది. ప్రభాకర్‌పై పరువు నష్టం దావా వేస్తామని కాంగ్రెస్ నేత, రాజ్యసభకు ఎన్నికైన రేణుకా చౌదరి బుధవారం హెచ్చరించారు. దీనిపై ప్రభాకర్ కూడా దీటుగా స్పందించారు. దీపాదాస్‌కు బెంజ్ కారు కొనివ్వడంపై తనవద్ద పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయని స్పష్టంచేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఇంతకూ ఎంపీ టికెట్ కోసం దీపాదాస్ మున్షీకి ఖరీదైన బెంజ్ కారు కొనిచ్చిన నాయకుడు/నాయకురాలు ఎవరన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నది. ఈ ఆరోపణలపై దీపాదాస్ మాత్రం ఇంతవరకూ స్పందించలేదు. ఈ అంశాన్ని కాంగ్రెస్ నాయకులు కొందరు పార్టీ అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు
సమాచారం.
కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జిలుగా పనిచేసిన నాయకులు వరుసగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2018 శాసనసభ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఇన్చార్జిగా ఉన్న ఆర్సీ కుంతియా ఎమ్మెల్యే టిక్కెట్లు అమ్ముకున్నారని అదే పార్టీకి చెందిన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌యాదవ్ ఆరోపించారు. ఆ తర్వాత రాష్ట్ర ఇన్చార్జిగా వచ్చిన మానిక్కం ఠాకూర్‌పై పార్టీ సీనియర్ నాయకుడు, ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఇలాంటి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మానిక్కం ఠాకూర్‌కు కోట్లాది రూపాయలు ఇచ్చి రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్ష పదవి కొనుకొన్నాడని కోమటిరెడ్డి ఆరోపించడం అప్పుట్లో సంచలనం రేపింది. ఈ ఆరోపణలను ప్రస్తావించిన బీఆర్ఎస్ నాయకులపై మానిక్కం ఠాకూర్ పరువు నష్టం దావా కూడా వేశారు. తాజాగా దీపాదాస్ మున్షీకి నజరానాగా బెంజ్ కారు ఇచ్చినట్టు వచ్చిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆరోపణలపై కారు ఇచ్చిన వారు కానీ, పుచ్చుకున్న ఆమె కానీ స్పందిస్తే సాక్ష్యాధారాలు బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు బీజేపీ నేత ప్రభాకర్ ప్రతి సవాల్ విసరడంతో కాంగ్రెస్-బీజేపీ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకొన్నది. కాంగ్రెస్-కమలం మధ్య రాజుకున్న ‘కారు చిచ్చు’ పార్లమెంట్ ఎన్నికల ముందు ఎటు దారి తీస్తుందోనన్న ఆసక్తి అటు రాజకీయ వర్గాలలోనూ, ఇటు ప్రజలలోనూ నెలకొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

