కాళోజీ సేవలను స్మరిస్తూ అక్టోబర్ 15, 16 తేదీల్లో సాహిత్య సభలు : ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ : ప్రజాకవి కాళోజీ చేసిన సాహిత్య సేవలను స్మరించుకునేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అక్టోబర్ 15, 16వ తేదీల్లో సాహిత్య సభలు నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. కాళోజీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో కాళోజీ నారాయణ రావుకు ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రతిష్టాత్మక కాళోజీ పురస్కారం- 2022కు ఎంపికైన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన ప్రముఖ కవి శ్రీరామోజు హరగోపాల్‌ను సన్మానించి, అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్ మంత్రి శ్రీదేవి, టీఎస్ ఫుడ్స్ ఛైర్మన్ మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

