TS Council | మంత్రి కేటీఆర్ ఉపన్యాసంపై ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న ప్రశంసలు
TS Council | రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉపన్యాసంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న ప్రశంసల వర్షం కురిపించారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కళాకారులకు పెన్షన్లు అనే అంశంపై గోరెటి వెంకన్న మాట్లాడారు.

హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉపన్యాసంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న ప్రశంసల వర్షం కురిపించారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కళాకారులకు పెన్షన్లు అనే అంశంపై గోరెటి వెంకన్న మాట్లాడారు.
మొన్న కేటీఆర్ ఉపన్యాసం విన్న తర్వాత ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, జేఎన్‌యూ యూనివర్సిటీల్లో ఇంటలెక్సువల్స్ మాట్లాడితే ఎట్ల ఉంటుందో అలా మాట్లాడారు. ప్రామాణికంగా మాట్లాడారు. సిద్ధాంతపరంగా మాట్లాడారు అని కేటీఆర్‌ను వెంకన్న ప్రశంసించారు.
తెలంగాణ కళలకు నిలయం. తెలంగాణ సంప్రదాయం దరువు సంప్రదాయం అని సింగ భూపాలుడు చెప్పారు. తెలంగాణకు చెందిన 200 మంది నాట్యకత్తెల పేర్లు.. కోణార్క్‌లోని సూర్యదేవాలయంలో ఉన్నాయి. తెలంగాణలో ఉన్న సంస్కృతి, సంప్రదాయాలతో ఈ ప్రాంతం పులకరించిపోతోంది. సంగీతానికి గొప్ప విలువ ఉంది. సీఎం కేసీఆర్‌కు అభివృద్ధి ప్రణాళికలతో పాటు సాహిత్యంపై విశేష అవగాహన ఉంది. తెలంగాణ ప్రభుత్వం కళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. 500 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం మొగిలయ్య 12 మెట్ల కిన్నెరను గుర్తించడం గొప్ప విషయమన్నారు. ఏ ప్రభుత్వమైతే సాహిత్యానికి, సంగీతానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందో.. ఆ పాలనలో మానవ స్వభావం వివేకవంతంగా ఉంటుంది. మనషుల యొక్క స్పృహ జ్ఞానవంతంగా ఉంటుంది. తెలంగాణలోని యాచకులు, బుడగజంగాలు, దేవదాసీలు, యక్షగాన కళాకారులను గుర్తించి, పెన్షన్ మంజూరు చేయాలని గోరెటి వెంకన్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

